త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?

డెబ్యూ మూవీ ప్రేమ‌మ్‌ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తాను న‌టించిన ప్ర‌తి సినిమాకు సాయిప‌ల్ల‌వి సొంతంగా డ‌బ్బింగ్ చెప్పింది. కానీ బాలీవుడ్ మూవీ రామాయ‌ణ‌లో మాత్రం సాయిప‌ల్ల‌వి పాత్ర‌కు మ‌రొక‌రు డ‌బ్బింగ్ చెప్ప‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీకి సాయిప‌ల్ల‌వి డ‌బ్బింగ్ చెప్పాల‌ని అనుకుంద‌ట‌. కానీ డైరెక్ట‌ర్ మాత్రం అందుకు అంగీక‌రించ‌లేద‌ని అంటున్నారు.

N

Entertainment | Published On May 21, 2026, 4.36 pm IST

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
Advertisement

Sai Pallavi | సాయిప‌ల్ల‌వి యాక్టింగ్‌కు మాత్ర‌మే కాకుండా ఆమె వాయిస్‌కు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం... భాష ఏదైనా ప్ర‌తి సినిమాకు తానే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డానికే ఇష్ట‌ప‌డుతుంది. అరువు గ‌ళాల‌పై ఆధార‌ప‌డ‌దు. భాష‌, డైలాగ్స్ ఉచ్చార‌ణ విష‌యంలో స‌హ‌జ‌త్వం ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డుతుంది. ఫిదా, ల‌వ్‌స్టోరీ సినిమాల్లో తెలంగాణ యాస‌లో సాయిప‌ల్ల‌వి చెప్పిన డైలాగ్స్ బాగా ఫేమ‌స్ అయ్యాయి. ఎంత క‌ష్ట‌మైన స‌రే భాష నేర్చుకొని డ‌బ్బింగ్ చెబుతుంది. ఆ అంకిత‌భావ‌మే సాయిప‌ల్ల‌విని టాప్ హీరోయిన్‌గా నిల‌బెట్టింది.కానీ ఫ‌స్ట్ టైమ్ సాయిప‌ల్ల‌వి డ‌బ్బింగ్‌ను ఓ డైరెక్ట‌ర్ రిజెక్ట్ చేశాడ‌ట‌. ఆమె పాత్ర‌కు మ‌రొక‌రు వాయిస్ అందించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సీత పాత్ర‌లో...

ర‌ణ‌భీర్ క‌పూర్ హీరోగా నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో దాదాపు నాలుగు వేల కోట్ల బ‌డ్జెట్‌తో బాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రామాయ‌ణ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇందులో ర‌ణ‌భీర్ క‌పూర్ రాముడిగా న‌టిస్తోండ‌గా...సీత‌గా సాయిప‌ల్ల‌వి క‌నిపించ‌బోతుంది. కేజీఎఫ్ ఫేమ్ య‌శ్ రావ‌ణుడిగా న‌టిస్తున్నారు.

డిజాస్ట‌ర్‌...

రామాయ‌ణ మూవీ రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. తొలి పార్ట్ ఈ ఏడాది దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రామాయ‌ణ మూవీలో సీత పాత్ర‌కు సాయిప‌ల్ల‌వి సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌ని అనుకుంద‌ట‌. కానీ డైరెక్ట‌ర్ నితీష్ తివారీ మాత్రం అందుకు అంగీక‌రించ‌లేద‌ని స‌మాచారం. సాయిప‌ల్ల‌వి అభ్య‌ర్థ‌న‌ను రిజెక్ట్ చేసిన‌ట్లు చెబుతున్నారు. సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూమూవీ ఏక్ దిన్ అందుకుకార‌ణ‌మ‌ట‌. ఇటీవ‌ల రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఏక్‌దిన్‌లో త‌న పాత్ర‌కు సాయిప‌ల్ల‌వి సొంతంగా డ‌బ్బింగ్ చెప్పింది. ఆమె డైలాగ్ డెలివ‌రీ, యాసపై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. ఆమె హిందీ డైలాగ్స్‌లో త‌మిళ యాస క‌నిపించింద‌ని నెటిజ‌న్లు ట్రోల్ చేశారు.

మైథ‌లాజిక‌ల్ మూవీ....

ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలోనే రామాయ‌ణ మూవీలో సాయిప‌ల్ల‌వి పాత్ర‌కు మ‌రొక‌రితో డ‌బ్బింగ్ చెప్పించాల‌ని డైరెక్ట‌ర్ అనుకుంటున్నార‌ట‌. అస‌లే మైథ‌లాజిక‌ల్ మూవీలో...అందులో పౌరాణిక పాత్ర కావ‌డంతో డ‌బ్బింగ్ విష‌యంలో డైరెక్ట‌ర్ రాజీప‌డ‌కూడ‌ద‌నే సాయిపల్లవి ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. హిందీ డైలాగ్స్ స‌రిగ్గా లేక‌పోతే విమ‌ర్శ‌ల‌తో పాటు వివాదాలు కూడా ఎదుర‌య్యే ఆస్కారం ఉండ‌టంతోనే రిస్క్ తీసుకోకూడ‌ద‌ని ఫిక్సైన‌ట్లు చెబుతున్నారు.  ద‌ర్శ‌కుడి నిర్ణ‌యంతో సాయిప‌ల్ల‌వి హ‌ర్ట్ అయ్యిందట. హిందీతో పాటు ద‌క్షిణాదిలో కూడా రామాయ‌ణ రిలీజ్ కాబోతుంది. ద‌క్షిణాది వెర్ష‌న్స్‌లో మాత్రం సాయిప‌ల్ల‌వి ఓన్ వాయిస్‌తో ఈ సినిమా రిలీజ్ కానుందని అంటున్నారు.

 

 

Advertisement
Advertisement