Bachupally Flyover | రేపు బాచుపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభం.. ఎన్‌హెచ్ 65పై ట్రాఫిక్ ఆంక్షలు
Bachupally Flyover | సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నూతనంగా నిర్మించిన బాచుపల్లి ఫ్లై ఓవర్‌ను సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
Bachupally Flyover | త్రినేత్ర.న్యూస్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నూతనంగా నిర్మించిన బాచుపల్లి ఫ్లై ఓవర్‌ను సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ మార్గాల్లో వచ్చే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు.
2022లోనే శంకుస్థాపన..
బాచుపల్లి ఫ్లై ఓవర్‌కు 2022లో నాటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రెండేండ్లలోనే అంటే 2024లోనే ఈ ఫ్లై ఓవర్ పూర్తి కావాల్సి ఉండే. కానీ అనివార్య కారణాల వల్ల ఫ్లై ఓవర్ పూర్తికి నాలుగు ఏండ్ల సమయం పట్టింది. 1.3 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ. 141 కోట్లు ఖర్చు పెట్టారు.
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
గండి మైసమ్మ, గాజులరామారం, బాచుపల్లి, నిజాంపేట్ ఏరియాల నుంచి మియాపూర్, కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, మదీనాగూడ, గచ్చిబౌలి ఏరియాలకు వెళ్లే ఐటీ ఉద్యోగులతో పాటు సాధారణ ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మియాపూర్ - నిజాంపేట్ - బాచుపల్లి స్ట్రెచ్‌ను దాటేందుకు దాదాపు 20 నిమిషాలకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు మాత్రం 5 నుంచి 10 నిమిషాల్లోనే ఈ స్ట్రెచ్‌ను దాటొచ్చు.
తాజావార్తలు
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఉదయం 6 నుంచే హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Shreyas Iyer | టీ20 జట్టుకు సారథ్యం దక్కడం గర్వకారణం.. తొలిసారిగా స్పందించిన శ్రేయాస్ అయ్యర్
- ●Nag Ashwin | ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింద కూర్చున్న నాగ్ అశ్విన్ - కల్కి డైరెక్టర్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా
- ●IND Vs AFG Test | బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత్.. 564 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్.. ఆఫ్ఘన్ స్కోర్ 81/3
- ●Women Safety Wing | ప్రాంతాల్లో పర్యటిస్తూ.. మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ
- ●INDIA | ఇండియా కూటమిలో లుకలకలు.. కాంగ్రెస్‌పై సీపీఎం ఆగ్రహం, రేపటి భేటీని బహిష్కరించిన డీఎంకే

Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఉదయం 6 నుంచే హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Shreyas Iyer | టీ20 జట్టుకు సారథ్యం దక్కడం గర్వకారణం.. తొలిసారిగా స్పందించిన శ్రేయాస్ అయ్యర్

Nag Ashwin | ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింద కూర్చున్న నాగ్ అశ్విన్ - కల్కి డైరెక్టర్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా

IND Vs AFG Test | బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత్.. 564 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్.. ఆఫ్ఘన్ స్కోర్ 81/3




