త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana Release Date | సాయిప‌ల్ల‌వి రామాయ‌ణ రిలీజ్ డేట్ ఇదేనా? – అనుకున్నదానికంటే ముందే థియేట‌ర్ల‌లోకి!

సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోన్న బాలీవుడ్ మూవీ రామాయ‌ణ రిలీజ్ డేట్ ఫిక్సైన‌ట్లు స‌మాచారం. ఈ పాన్ ఇండియన్ మూవీని దీపావ‌ళికి రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. తాజాగా అనుకున్న డేట్ కంటే ముందే ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రానుంద‌ట‌.

N

Entertainment | Published On May 25, 2026, 2.32 pm IST

Ramayana Release Date | సాయిప‌ల్ల‌వి రామాయ‌ణ రిలీజ్ డేట్ ఇదేనా? – అనుకున్నదానికంటే ముందే థియేట‌ర్ల‌లోకి!
Advertisement

Ramayana Release Date |  ఏక్ దిన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సాయిప‌ల్ల‌వి. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమా సాయిప‌ల్ల‌వి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ బాలీవుడ్ మూవీని ఆమిర్‌ఖాన్ నిర్మించ‌గా...అత‌డి కొడుకు జునైద్ ఖాన్ హీరోగా న‌టించాడు. ఏక్ దిన్ డిజాస్ట‌ర్‌పై ఇటీవ‌ల సాయిప‌ల్ల‌వి రియాక్ట్ అయ్యింది. హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు తాను రాంగ్ ఛాయిస్ అని సినిమాను అంగీక‌రించిన‌ప్పుడే అర్థ‌మైందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

సీత పాత్ర‌లో...

ఏక్ దిన్ త‌ర్వాత రామాయ‌ణ మూవీతో బాలీవుడ్ ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించ‌బోతుంది సాయిప‌ల్ల‌వి. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీపై బోలెడు ఆశ‌లు పెట్టుకుంది. ఈ సినిమాలో ర‌ణ‌భీర్‌క‌పూర్ రాముడిగా న‌టిస్తుండ‌గా...సీత పాత్ర‌ను సాయిప‌ల్ల‌వి పోషిస్తుంది. దాదాపు నాలుగు వేల కోట్ల బ‌డ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా రామాయ‌ణ మూవీ రూపొందుతోంది.

వారం ముందే...

దీపావ‌ళికి ఈ సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకురాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సైన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.  అనుకున్న డేట్ కంటే వారం ముందే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నదట.

అక్టోబ‌ర్ 30న‌...

అక్టోబ‌ర్ 30న రామాయ‌ణ పార్ట్ వ‌న్ మూవీని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ట‌. న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో గాడ్జిల్లా, జైల‌ర్2తో పాటు మ‌రికొన్ని సినిమాలు ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్నాయి. ఈ పాన్ ఇండియ‌న్ సినిమాల‌తో పోటీప‌డ‌టం కంటే వారం ముందే థియేట‌ర్ల‌లోకి రావ‌డం బెట‌ర్ అని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నార‌ట‌.

సాయిప‌ల్ల‌వి ఫ‌స్ట్ లుక్‌...

రామాయ‌ణ మూవీ నుంచి ఇప్ప‌టికే ర‌ణ‌భీర్‌క‌పూర్‌, య‌శ్ లుక్‌ల‌ను రిలీజ్ చేశారు. త్వ‌ర‌లోనే సాయిప‌ల్ల‌వి ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఈ పౌరాణిక సినిమాలో య‌శ్ రావ‌ణుడిగా క‌నిపించ‌బోతున్నాడు. అంతే కాకుండా స‌హ‌నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ తో పాటు ప‌లువురు బాలీవుడ్ టాప్ యాక్ట‌ర్స్ ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

 

Advertisement
Advertisement