త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | ఓట‌రు న‌మోదు బాధ్య‌త ముమ్మాటికీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌దే

Talasani Srinivas Yadav | ఓటరు నమోదు బాధ్యత ముమ్మాటికీ ఎన్నికల కమిషన్‌పైనే ఉన్నది అని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Oct 26, 2026, 3.55 pm IST

Talasani Srinivas Yadav | ఓట‌రు న‌మోదు బాధ్య‌త ముమ్మాటికీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌దే
Advertisement

సీఈవోను క‌లిసిన అనంత‌రం మీడియాతో మాజీ మంత్రి త‌ల‌సాని

Talasani Srinivas Yadav | త్రినేత్ర న్యూస్ : ఓటరు నమోదు బాధ్యత ముమ్మాటికీ ఎన్నికల కమిషన్‌పైనే ఉన్నది అని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ప‌ష్టం చేశారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో జరుగుతున్న తప్పిదాలపై ఎన్నికల కమిషన్ సీఈవో సుదర్శన్ రెడ్డికి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం విన‌తిప‌త్రం అంద‌జేసింది.

అనంత‌రం త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో నమోదు కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నా ఎన్నికల కమిషన్ బాధ్యతగా వ్యవహరించడం లేదు. నవంబర్ 6వ తేదీతో గడువు ముగియనున్న ఇప్పటి వరకు కనీసం బీఎల్‌వోలను నియమించలేదు.. ఎలాంటి ప్రచారాలు నిర్వహించలేదు. స‌ర్‌ కార్యక్రమంతో లక్షలాది ఓట్లు తొలగించిన ఎన్నికల కమిషన్ తమకేమీ పట్టనట్లుగా ఉంది. ఇప్పటికైనా ఇంటింటికీ వెళ్ళి ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి అని త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement