త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyclone Arnab | అర్నాబ్ ఎఫెక్ట్.. రేప‌ట్నుంచి తెలంగాణ‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు..!

Cyclone Arnab | బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర వాయుగుండం అర్నాబ్ తుఫానుగా ( Cyclone Arnab ) బ‌ల‌ప‌డింది. సోమ‌వారం అర్ధ‌రాత్రికి అది తీవ్ర తుఫాన్‌గా, మంగ‌ళ‌వారం అతి తీవ్ర తుఫానుగా బ‌ల‌ప‌డ‌నుంది.

S

Telangana | Published On Oct 26, 2026, 4.20 pm IST

Cyclone Arnab | అర్నాబ్ ఎఫెక్ట్.. రేప‌ట్నుంచి తెలంగాణ‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు..!
Advertisement

Cyclone Arnab | త్రినేత్ర న్యూస్ : బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర వాయుగుండం అర్నాబ్ తుఫానుగా ( Cyclone Arnab ) బ‌ల‌ప‌డింది. సోమ‌వారం అర్ధ‌రాత్రికి అది తీవ్ర తుఫాన్‌గా, మంగ‌ళ‌వారం అతి తీవ్ర తుఫానుగా బ‌ల‌ప‌డ‌నుంది. దీంతో మంగ‌ళ‌వారం (అక్టోబ‌ర్ 27) రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain Update) కురుస్తాయని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. అక్టోబ‌ర్ 28న ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది వాతావ‌ర‌ణ శాఖ‌. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, సూర్యాపేట‌, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది.

హైద‌రాబాద్‌లో మోస్త‌రు వ‌ర్షం..!

హైద‌రాబాద్ న‌గ‌రంలో తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. లేదంటే ఆకాశ‌మంతా మేఘావృత‌మై ఉండ‌నుంది. బ‌ల‌మైన ఈదురుగాలులు కూడా వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Advertisement
Advertisement