Toxic | టాక్సిక్ నుంచి తబాహి సాంగ్ వచ్చేసింది.. ట్రెండింగ్‌లో యశ్, కియారా జోడీ..!
Toxic | కన్నడ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘తబాహి’ తొలి వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాట విడుదలైన కొద్దిసేపటికే ట్రెండింగ్‌లో ఉన్నది. ‘తబాహి’ పాటలో యశ్, కియారా అద్వానీల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Entertainment | Published On Jul 8, 2026, 7.24 pm IST
Toxic | కన్నడ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘తబాహి’ తొలి వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాట విడుదలైన కొద్దిసేపటికే ట్రెండింగ్‌లో ఉన్నది. ‘తబాహి’ పాటలో యశ్, కియారా అద్వానీల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. పాటలోని విజువల్స్, భారీ సెట్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రేమ, భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని ఈ పాట ద్వారా అర్థమవుతోంది.
ఈ పాట తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పాటకు సంగీత పరంగా మంచి స్పందన వస్తోంది. ‘టాక్సిక్’ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, కియారా అద్వానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్, తనిష్క్ బాగ్చీ మ్యూజిక్ అందించారు. కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి యశ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నుంచి వస్తున్న మరో భారీ చిత్రం కావడంతో ‘టాక్సిక్’పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
జులై 18, 2026
తాజావార్తలు
- ●Weekly Horoscope | ఈరాశివారు ఆశించిన ఫలితాలు పొందుతారు.. ఆ పనులకు దూరంగా ఉంటే మంచింది!
- ●ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..
- ●Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Weekly Horoscope | ఈరాశివారు ఆశించిన ఫలితాలు పొందుతారు.. ఆ పనులకు దూరంగా ఉంటే మంచింది!

ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..

Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక



