Sai Pallavi | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన సాయిపల్లవి – కానీ కండీషన్స్ అప్లై
నాచురల్ బ్యూటీ సాయిపల్లవి ప్రస్తుతం తమిళంలో దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో ఓ రొమాంటిక్ డ్రామా సినిమా చేస్తోంది. ఇంజివెల్లం పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్నాడు. ఈ సినిమా కోసం తన రెమ్యూనరేషన్‌కు సగానికిపైగా తగ్గించినట్లు సమాచారం.
Entertainment | Published On Oct 8, 2026, 3.12 pm IST
Sai Pallavi | నాచురల్ బ్యూటీ సాయిపల్లవి తన రెమ్యూనరేషన్‌ను సగానికి పైగా తగ్గించింది. దిగ్గజ దర్శకుడిపై గౌరవంతోనే ఈ పనిచేసినట్లు సమాచారం. తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ స్టార్ హీరోయిన్ తమిళంతో మాత్రం బిజీగా ఉంది. ప్రస్తుతం ధనుష్ ఓంతో పాటు మణిరత్నం దర్శకత్వంలో ఇంజివెల్లం అనే సినిమా చేస్తోంది.
రొమాంటిక్ డ్రామా...
మణిరత్నం సినిమాలో సాయిపల్లవికి జోడీగా విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్నాడు.రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. లిమిటెడ్ బడ్జెట్‌లో రియలిస్టిక్ లోకేషన్స్‌లో ప్రయోగాత్మకంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. సెప్టెంబర్‌లో ఇంజివెల్లం షూటింగ్ మొదలైంది. నవంబర్‌లోగా చిత్రీకరణను పూర్తిచేసి డిసెంబర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారు.
రెమ్యూనరేషన్...
కాగా ఇంజివెల్లం సినిమా కోసం సాయిపల్లవితో పాటు విజయ్ సేతుపతి తమ రెమ్యూనరేషన్‌ను సగానికంటే ఎక్కువగానే తగ్గించుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు సాయిపల్లవి పది నుంచి పన్నెండు కోట్ల మధ్య పారితోషికం స్వీకరిస్తోంది. కానీ మణిరత్నం సినిమా కోసం కేవలం మూడు కోట్లు మాత్రమే స్వీకరించినట్లు సమాచారం. మణిరత్నం సినిమాలో నటించాలన్నది తన డ్రీమ్ అని చాలా సార్లు సాయిపల్లవి చెప్పింది. ఆయనపై గౌరవంతోనే తక్కువ రెమ్యూనరేషన్‌కే ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి సైతం ఒక్కో సినిమాకు పదిహేను కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇంజివెల్లం కోసం అతడు ఆరు కోట్లు మాత్రమే తీసుకున్నట్లు తెలిసింది.
కష్టాల్లో కెరీర్...
మణిరత్నం కెరీర్ కష్టాల్లో ఉంది. 2015లో వచ్చిన ఓకే బంగారం తర్వాత అతడికి హిట్టు లేదు. థగ్‌లైఫ్, పొన్నియన్ సెల్వన్‌తో పాటు మణిరత్నం చేసిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తక్కువ బడ్జెట్‌లో సినిమా చేసి హిట్టు కొట్టాలనే ఆలోచనతోనే మణిరత్నం ఇంజివెల్లంను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దర్శకుడి రిక్వెస్ట్ మేరకు విజయ్ సేతుపతి, సాయిపల్లవి పారితోషికాలు తగ్గించినట్లు సమాచారం. ఈ డిస్కౌంట్‌లు కేవలం మణిరత్నం సినిమా వరకే పరిమితమని తెలిసింది.
సీత పాత్రలో...
ఇంజివెల్లంతో పాటు బాలీవుడ్‌లో రామాయణ సినిమా చేస్తోంది సాయిపల్లవి. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Indian 3 Movie | ‘భారతీయుడు3’కి లైన్ క్లియర్ – తిరిగి సెట్స్‌పైకి కమల్‌హాసన్ మూవీ – ముగ్గురు హీరోయిన్లతో
అక్టోబర్ 8, 2026

Tollywood | పెళ్లిపీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ సీనియర్ హీరో కూతురు
అక్టోబర్ 8, 2026

Shruti Haasan | రాక్‌స్టార్ వైబ్‌తో అదరగొట్టిన శ్రుతి హాసన్.. నెట్టింట ఫొటోలు వైరల్
అక్టోబర్ 7, 2026
తాజావార్తలు
- ●TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
- ●High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్

High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు



