Sai Pallavi | సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ – తొలిరోజే థియేటర్లు ఖాళీ
నాచురల్ బ్యూటీ సాయిపల్లవికి బాలీవుడ్ ఆడియెన్స్ పెద్ద షాకిచ్చారు. డెబ్యూ మూవీ ఏక్ దిల్ తొలిరోజు కేవలం కోటి పదిహేను లక్షల వసూళ్లతో డిసపాయింట్ చేసింది. తొలిరోజు ఆడియెన్స్ లేక థియేటర్ల మొత్తం ఖాళీగా దర్శనమిచ్చాయి.
Entertainment | Published On May 2, 2026, 4.53 pm IST
Sai Pallavi | దక్షిణాదిలో హయ్యెస్ట్ సక్సెస్ రేటుఉన్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది సాయిపల్లవి. నాచురల్ బ్యూటీ అంగీకరించిందంటే ఆ సినిమా హిట్టే అనే నమ్మకం దర్శకనిర్మాతలతో పాటు ఆడియెన్స్‌లో కనిపిస్తుంది. సాయిపల్లవి చేసిన పలు తమిళ, తెలుగు సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. కానీ బాలీవుడ్‌లో మాత్రం తొలి అడుగులోనే సాయిపల్లవికి పెద్ద షాక్ తగిలింది. హిందీ డెబ్యూ మూవీ ఏక్ దిన్ ఆడియెన్స్ లేక తొలిరోజే చాలా థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్...
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నిర్మించిన ఏక్ దిన్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సాయిపల్లవి. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించాడు. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహించాడు.
భారీగా అంచనాలు...
ఈ సినిమా స్టోరీ నుంచి ప్రొడక్షన్, రిలీజ్ వరకు అన్ని వ్యవహారాలను ఆమిర్ ఖాన్ దగ్గరుండి చూసుకున్నారు. రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్ భారీగానే చేశారు. ఆమిర్ ఖాన్ క్రేజ్‌కు తోడు కథల ఎంపికలో సాయిపల్లవి జడ్జిమెంట్ కారణంగా ఏక్ దిన్ భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.
విమర్శలు...ట్రోల్స్...
కానీ అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. జునైద్ ఖాన్, సాయిపల్లవి కెమిస్ట్రీ అస్సలు బాగాలేదని, సాయిపల్లవి యాక్టింగ్ ముందు జునైద్ పూర్తిగా తేలిపోయాడని నెటిజన్లు అంటున్నారు. కథలో ఒరిజినల్ ఫీల్ మిస్సయ్యిందని, కొరియన్ మూవీని ఫ్రేమ్ టూ ఫ్రేమ్ కాపీ చేశారంటూ చాలానే విమర్శలు వినిపిస్తున్నాయి.
కలెక్షన్స్...
దాదాపు ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తోరూపొందిన ఏక్ దిన్ తొలిరోజు కేవలం కోటి పదిహేను లక్షల రూపాయల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీని ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. పోటీగా పెద్ద సినిమాలేవి లేకపోయినా బాక్సాఫీస్ వద్ద ఏక్ దిన్ అంతగా ప్రభావం చూపించలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. తొలి రోజు ఈ సినిమా ఆక్యుపెన్సీ కేవలం 14 శాతం కావడం గమనార్హం. రెండు రోజు కలెక్షన్స్ మరింత తగ్గవచ్చని అంటున్నారు. ఓవరాల్‌గా సాయిపల్లవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఈ సినిమా నిలవడం ఖాయమని అంటున్నారు.
థాయ్‌లాండ్ మూవీ వన్ డేకు రీమేక్‌గా ఏక్ దిన్ మూవీ రూపొందింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



