త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rukmini Vasanth | వ‌రుస‌గా ఎనిమిది ఫ్లాప్‌లు – అయినా ఛాన్స్‌లు – హీరో నాని ప్రేమ‌క‌థ‌లో రుక్మిణి వ‌సంత్‌

య‌శ్ టాక్సిక్‌తో కెరీర్‌లో ఎనిమిదో ఫ్లాప్‌ను త‌న ఖాతాలో వేసుకుంది క‌న్న‌డ బ్యూటీ రుక్మిణి వ‌సంత్‌. ఈ డిజాస్ట‌ర్ల‌తో సంబంధం లేకుండా తెలుగులో రెండు సినిమాల‌ను అంగీక‌రించింది. నాని హీరోగా 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌బోతుంది. ఈ ల‌వ్‌స్టోరీతో పాటు ఒకే ఒక జీవితం ద‌ర్శ‌కుడితో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఈ ముద్దుగుమ్మ ఒకే చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Oct 13, 2026, 2.43 pm IST

Rukmini Vasanth | వ‌రుస‌గా ఎనిమిది ఫ్లాప్‌లు – అయినా ఛాన్స్‌లు – హీరో నాని ప్రేమ‌క‌థ‌లో రుక్మిణి వ‌సంత్‌
Advertisement

Rukmini Vasanth |  సినీ ప‌రిశ్ర‌మ‌లో రెండు, మూడు ఫ్లాప్‌లు వ‌స్తేనే హీరోయిన్ల అవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఐరెన్ లెగ్ అంటూ ముద్ర‌లు వేస్తారు. క‌న్న‌డ బ్యూటీ రుక్మిణి వ‌సంత్‌కు (Rukmini Vasanth) వ‌రుస‌గా ఎనిమిది డిజాస్ట‌ర్లు ఎదుర‌య్యాయి. అయినా ఈ ముద్దుగుమ్మ‌కు అవ‌కాశాల‌కు ఢోకా లేదు. తాజాగా ఈ క‌న్న‌డ సోయగం టాలీవుడ్‌లో మ‌రో రెండు ల‌క్కీ ఛాన్స్‌లు ద‌క్కించుకున్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌టి ప్రేమ‌క‌థ కాగా...మ‌రోటి లేడీ ఓరియెంటెడ్ మూవీ అని స‌మాచారం.

96 డైరెక్ట‌ర్‌తో...

ప్యార‌డైజ్ త‌ర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు నాచుర‌ల్ స్టార్ నాని (Hero Nani) స‌న్నాహాలు చేస్తోన్నారు. ఈ వారంలోనే సుజీత్ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న‌ బ్ల‌డీ రోమియో సెట్స్‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. బ్ల‌డీ రోమియోతో పాటు 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ష‌న్‌లో నాని ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇటీవ‌లే ప్యార‌డైజ్ ప్ర‌మోష‌న్స్‌లో త‌మిళ ద‌ర్శ‌కుడితో మూవీని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు.

ప్యూర్ ల‌వ్‌స్టోరీ...

96 త‌ర‌హాలోనే ప్యూర్ ల‌వ్‌స్టోరీ, రియ‌లిస్టిక్ ఎమోష‌న్స్‌తో డైరెక్ట‌ర్ ప్రేమ్ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. నాయ‌కానాయిక‌ల కెమిస్ట్రీ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వ‌సంత్‌ను ఫైన‌ల్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. హీరోతో స‌మానంగా ప్రాధాన్య‌మున్న క్యారెక్ట‌ర్‌లో ఈ కాంతార బ్యూటీ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌...

నాని సినిమాతో పాటు తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రుక్మిణి వ‌సంత్ ఓకే చెప్పింది.  ఒకే ఒక జీవితం ఫేమ్ శ్రీ కార్తిక్ ఈ మ‌హిళా ప్ర‌ధాన సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో ఛాలెంజింగ్ రోల్‌లో రుక్మిణి క‌నిపించ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ సినిమా రూపొంద‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ (NTR)డ్రాగ‌న్‌లో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ వ‌చ్చే జూన్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

Advertisement
Advertisement