త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mowgli OTT | ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి మోగ్లీ – సుమ క‌న‌కాల కొడుకు మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

యాంక‌ర్ సుమ క‌న‌కాల త‌న‌యుడు రోష‌న్ క‌న‌కాల హీరోగా న‌టించిన మోగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. జ‌న‌వ‌రి 1న ఈటీవీ విన్ ఓటీటీలో యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీ విడుద‌ల కాబోతుంది.

N

Entertainment | Published On Dec 26, 2025, 10.51 pm IST

Mowgli OTT | ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి మోగ్లీ – సుమ క‌న‌కాల కొడుకు మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Advertisement

Mowgli OTT | యాంక‌ర్ సుమ క‌న‌కాల కొడుకు రోష‌న్ హీరోగా న‌టించిన మోగ్లీ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీకి క‌ల‌ర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాక్షి మ‌డోల్క‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై అగ్ర నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మించారు.
డిసెంబ‌ర్ 13న థియేట‌ర్ల‌లో రిలీజైన మోగ్లీ క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. జ‌న‌వ‌రి 1 నుంచి ఈటీవీ విన్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. కొత్త పోస్ట‌ర్ ద్వారా ఓటీటీ విడుద‌ల తేదీని ఈటీవీ విన్ క‌న్ఫామ్ చేసింది.

అఖండ 2తో పోటీ...

రొటీన్ కాన్సెప్ట్‌కు తోడు బాల‌కృష్ణ అఖండ 2 తో పోటీ కార‌ణంగా మోగ్లీ అనుకున్న స్థాయిలో క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌లేక‌పోయింది. మోగ్లీ మూవీలో బండి స‌రోజ్ కుమార్ విల‌న్‌గా క‌నిపించాడు. ఎం.ఎం కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ మ్యూజిక్ అందించారు. సుహాస్, రియా సుమ‌న్ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించారు.
రాజీవ్ క‌న‌కాల‌, సుమ క‌న‌కాలతో ఉన్న అనుబంధం కార‌ణంగా ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, నానితో పాటు ప‌లువురు స్టార్ హీరోలు మోగ్లీ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్నారు. కానీ అగ్ర హీరోల‌ స‌పోర్ట్ కూడా ఈ సినిమాను గ‌ట్టెక్కించ‌లేక‌పోయింది.

మోగ్లీ క‌థ ఇదే...

మోగ్లీ ఓ అనాథ‌. సినిమా షూటింగ్‌ల కోసం తాను ఉండే అట‌వీ ప్రాంతానికి వ‌చ్చిన వారికి సాయం చేస్తుంటాడు. ఓ షూటింగ్‌లో జాస్మిన్‌ను చూసి ఇష్ట‌ప‌డ‌తాడు మోగ్లీ. జాస్మిన్‌పై క్రిస్టోఫ‌ర్ నోల‌న్ అనే పోలీస్ ఆఫీస‌ర్ కూడా మ‌న‌సుప‌డ‌తాడు. మోగ్లీని చంపాల‌ని చూస్తాడు నోల‌న్‌. ఆ త‌ర్వాత ఏమైంది. క్రిస్టోఫ‌ర్ నోల‌న్ బారి నుంచి జాస్మిన్‌ను మోగ్లీ ఎలా కాపాడాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. బ‌బుల్ గ‌మ్ సినిమాతో రోష‌న్ క‌న‌కాల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మోగ్లీ అత‌డి సెకండ్ మూవీ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా కొన్ని సినిమాల్లో న‌టించాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement