త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఓటీటీలోకి తెలుగు బోల్డ్ కామెడీ మూవీ – భ‌ర్త స‌మ‌స్య‌పై భార్య పంచాయ‌తీ పెడితే…

తిరువీర్ హీరోగా న‌టించిన తెలుగు బోల్డ్ కామెడీ మూవీ పాపం ప్ర‌తాప్ ఇర‌వై రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ మంగ‌ళ‌వారం అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ అయ్యాయి.

N

Entertainment | Published On May 5, 2026, 12.32 pm IST

Telugu OTT | ఓటీటీలోకి తెలుగు బోల్డ్ కామెడీ మూవీ – భ‌ర్త స‌మ‌స్య‌పై భార్య పంచాయ‌తీ పెడితే…
Advertisement

Telugu OTT | కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ హీరోగా వైవిధ్య‌త‌ను చాటుకుంటున్నాడు తిరువీర్. అత‌డు హీరోగా న‌టించిన పాపం ప్ర‌తాప్ మూవీ ఇటీవ‌లే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ బోల్డ్ కామెడీ మూవీకి దుర్గా న‌రేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పాయ‌ల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో అజ‌య్ ఘోష్‌, రాశి, గోప‌రాజు ర‌మ‌ణ‌, శ్రీనివాస్ అవ‌స‌రాల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఈటీవీ విన్ ఓటీటీలో...

పాపం ప్ర‌తాప్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ కామెడీ మూవీ మే 7న ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన ఈటీవీ విన్ ఓటీటీ ఓ పోస్ట‌ర్‌ను షేర్ చేసింది.

స్లీపింగ్ డిజార్డ‌ర్‌...

స్లీపింగ్ డిజార్డ‌ర్ అనే కాన్సెప్ట్‌కు కామెడీ, ల‌వ్‌స్టోరీని జోడించి ద‌ర్శ‌కుడు పాపం ప్ర‌తాప్ సినిమాను తెర‌కెక్కించారు. బూతు ఎక్కువ కావ‌డం, క‌థ‌లో ఎమోష‌న్స్ అంతగా పండ‌క‌పోవ‌డంతో పాపం ప్ర‌తాప్ యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తిరువీర్ తో పాటు అజ‌య్ ఘోష్ న‌ట‌నకు మాత్రం మంచి పేరొచ్చింది. ఈ సినిమాకు కేఎమ్ రాధాకృష్ణ‌న్‌, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు.

బుజ్జ‌మ్మ పంచాయ‌తీ...

సీతారామ‌పురానికి చెందిన ప్ర‌తాప్ (తిరువీర్‌) చిన్న‌ప్ప‌టి నుంచి త‌మ ఊరికే చెందిన‌ బుజ్జ‌మ్మ‌ను(పాయ‌ల్ రాధాకృష్ణ‌) ప్రేమిస్తుంటాడు. తండ్రి మాట‌ను కాద‌ని బుజ్జ‌మ్మ‌ను పెళ్లి చేసుకుంటాడు ప్ర‌తాప్‌. కానీ పెళ్లైన మూడు రోజుల‌కే ప్ర‌తాప్‌కు ఓ స‌మ‌స్య ఉంద‌ని బుజ్జ‌మ్మ పంచాయ‌తీ పెడుతుంది. భ‌ర్త‌ను వ‌దిలేసి పుట్టింటికి వెళ్లిపోతుంది. అస‌లు ప్ర‌తాప్‌కు ఉన్న స‌మ‌స్య ఏమిటి? కొడుకు కార‌ణంగా ఊళ్లో వీర‌య్య ప‌రువు మ‌ర్యాద‌ల‌కు ఎలాంటి ఇబ్బంది ఏర్ప‌డింది? బుజ్జ‌మ్మ ప్రేమ కోసం ప్ర‌తాప్ ఏం చేశాడు? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

Advertisement
Advertisement