త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్ – ప్రేమ‌కు కులం అడ్డుగా నిలిస్తే!

అన్బే డ‌యానా అనే త‌మిళ సినిమాతో దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత యాక్ట‌ర్‌గా రీఎంట్రీ ఇచ్చింది మాజీ మంత్రి రోజా. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అన్బే డ‌యానా మూవీ ఆగ‌స్ట్ 28 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.

N

Entertainment | Published On Aug 10, 2026, 8.35 pm IST

OTT | ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్ – ప్రేమ‌కు కులం అడ్డుగా నిలిస్తే!
Advertisement

OTT |  ప‌దేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత అన్బే డ‌యానా సినిమాతో మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చింది మాజీ మంత్రి రోజా. ఈ త‌మిళ మూవీలో స‌ర‌ళ అనే మాస్ రోల్‌లో క‌నిపించింది. జూలైలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో ప‌రి ఇళ‌వ‌ళ‌గ‌న్ హీరోగా న‌టిస్తూనే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌మ్య రంగ‌నాథ‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

సోనీలివ్‌....

అన్బే డ‌యానా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. ఆగ‌స్ట్ 28 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఈ త‌మిళ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.

కుల‌మ‌తాల అడ్డంకి....

ఓ యువ జంట ప్రేమ‌కు కుల‌మ‌తాలు ఎలా అడ్డంకిగా మారాయ‌నే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది. ఇందులో కొడుకు కంటే కుల‌మే ముఖ్య‌మ‌ని న‌మ్మే మ‌హిళ‌గా రోజా క‌నిపించింది. డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించింది. కృష్ణ ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన యువ‌కుడు. ఆంగ్లో ఇండియ‌న్ అమ్మాయి డ‌యానాతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. డ‌యానా స్వేచ్ఛ‌గా జీవితాన్ని గ‌డుపుతుంటుంది. మందు, సిగ‌రెట్లు అల‌వాటు ఉంటాయి. కానీ కృష్ణ అందుకు విరుద్ద‌మైన వాతావ‌ర‌ణంలో పెరుగుతాడు. డ‌యానాతో ప్రేమ‌కు కృష్ణ త‌ల్లి స‌ర‌ళ అడ్డు చెబుతుంది. త‌న కులానికే చెందిన మ‌రో అమ్మాయితో కొడుకు పెళ్లిని ఫిక్స్ చేస్తుంది. ఆ త‌ర్వాత ఏమైంది? త‌ను ప్రేమించిన డ‌యానా కోసం కృష్ణ ఏం చేశాడు? కొడుకు ప్రేమ స‌ర‌ళ‌లో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

అన్బే డ‌యానాతో పాటు త‌మిళంలో లెనిన్ పాండియ‌న్ అనే సినిమాలో కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది రోజా. తెలుగులో మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటున్న రోజా టీవీ షోస్ చేస్తుంది.

 

 

 

 

Advertisement
Advertisement