Vande Bharat Sleeper | మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!
Vande Bharat Sleeper | సుదూర ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ముంబయి–బెంగళూరు, వారణాసి–న్యూఢిల్లీ మార్గాల్లో వీటిని నడపనున్నారు. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ముంబయి–బెంగళూరు రైలును అక్టోబర్ 31న, వారణాసి–న్యూఢిల్లీ రైలును నవంబర్ 1న ప్రారంభించనున్నారు. రాత్రిపూట ప్రయాణించి మరుసటి ఉదయం గమ్యస్థానాలకు చేరుకునేలా వీటిని రూపొందించారు.
- ముంబయి–బెంగళూరు, వారణాసి–న్యూఢిల్లీ మార్గాల్లో పట్టాలెక్కనున్న రైళ్లు
- రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే వేగం, సౌకర్యాల్లో ప్రత్యేకతలు
Vande Bharat Sleeper | సుదూర ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ముంబయి–బెంగళూరు, వారణాసి–న్యూఢిల్లీ మార్గాల్లో వీటిని నడపనున్నారు. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ముంబయి–బెంగళూరు రైలును అక్టోబర్ 31న, వారణాసి–న్యూఢిల్లీ రైలును నవంబర్ 1న ప్రారంభించనున్నారు. రాత్రిపూట ప్రయాణించి మరుసటి ఉదయం గమ్యస్థానాలకు చేరుకునేలా వీటిని రూపొందించారు. ఆధునిక సదుపాయాలతో వస్తున్న ఈ రైళ్లను రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోలుస్తున్నారు.
ఇంజిన్ లేకుండానే ప్రయాణం
వందేభారత్ స్లీపర్ రైలుకు ప్రత్యేక ఇంజిన్ ఉండదు. రైలులోని వివిధ కోచ్‌లలో మోటార్లు, సాంకేతిక వ్యవస్థలను అమర్చారు. ముందు, వెనుక డ్రైవర్ క్యాబిన్లు ఉండటంతో రెండు వైపులా ప్రయాణించగలదు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మాత్రం ముందు ఇంజిన్ ఉండి, వెనుక ఏసీ కోచ్‌లను లాగుతుంది. వందేభారత్ స్లీపర్ రైలును గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. ట్రయల్ రన్‌లో గంటకు 180 కిలోమీటర్లకుపైగా వేగాన్ని అందుకున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. సాధారణ ప్రయాణంలో వేగం ట్రాక్, సిగ్నలింగ్, రూట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ గరిష్ఠ నిర్వహణ వేగం సాధారణంగా గంటకు 130 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
ఆధునిక బెర్తులు.. మెరుగైన సౌకర్యాలు
వందేభారత్ స్లీపర్‌లో మెత్తని బెర్తులు, ఆధునిక లైటింగ్, లగేజీ నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేశారు. కోచ్‌ల మధ్య మూసివేసిన అనుసంధాన మార్గాలు ఉండటంతో దుమ్ము, బయటి శబ్దం తగ్గే అవకాశం ఉంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వందేభారత్ స్లీపర్‌లో పటిష్టమైన బాడీ, ఢీకొన్నప్పుడు ప్రభావాన్ని తగ్గించే ప్రత్యేక పరికరాలు, ఆటోమేటిక్ తలుపులు, మెరుగైన అగ్నిమాపక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. బయో-వాక్యూమ్ టాయిలెట్లు, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు కూడా ఉంటాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, ఆధునిక బ్రేకింగ్ వ్యవస్థతో పాటు ఇతర భద్రతా సదుపాయాలు ఉన్నాయి.
ఆర్‌ఏసీ ఉండదు
వందేభారత్ స్లీపర్‌లో ఆర్‌ఏసీ టికెట్ల సదుపాయం ఉండదని సమాచారం. కన్ఫర్మ్ టికెట్ రద్దయితే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి బెర్తు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మాత్రం వర్తించే కోటా, బెర్తుల లభ్యతను బట్టి ఆర్‌ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేస్తారు. వందేభారత్ స్లీపర్ ప్రారంభ బేస్ ఛార్జీలను కిలోమీటరు ప్రాతిపదికన నిర్ణయించినట్లు సమాచారం. జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ ఏసీ 3-టైర్‌లో కిలోమీటరుకు రూ.2.40, ఏసీ 2 టైర్‌లో కిలోమీటరుకు రూ.3.10, ఫస్ట్ ఏసీలో కిలోమీటరుకు రూ.3.80 చొప్పున వసూలు చేస్తారు.
టికెట్ ధరలు ఎలా?
అయితే, వారణాసి–న్యూఢిల్లీ మార్గంలో వందేభారత్ స్లీపర్ టికెట్ ధరలను ఇంకా ఖరారు చేయలేదు. అంచనా ప్రకారం.. ఏసీ 3-టైర్ టికెట్ రూ.2,100, ఏసీ 2-టైర్ రూ.2,600, ఫస్ట్ ఏసీ రూ.3,200 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే మార్గంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరలు ఏసీ 3-టైర్‌కు సుమారు రూ.1,900, ఏసీ 2-టైర్‌కు రూ.2,600, ఫస్ట్ ఏసీకి రూ.3,200గా ఉన్నాయి. ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వీటికంటే తక్కువ ధరలకు ప్రయాణించే అవకాశం ఉంది. అయితే రైలు, కోచ్ తరగతి, ప్రయాణ దూరం, బుకింగ్ నిబంధనలను బట్టి ఛార్జీలు మారనున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Saudi Arabia Houthi Deal | యుద్ధం ఆపేందుకు రూ.8,400 కోట్లు?: హౌతీలతో సౌదీ సీక్రెట్ డీల్.. తెరవెనుక ఇరాన్ చక్రం!
- ●Tiger Shroff Firing Case | టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో కీలక పరిణామం.. నిందితులందరిపై మోకా చట్టం!
- ●Kannada Producer | కన్నడ అగ్ర నిర్మాత సిల్క్మంజు కన్నుమూత - సినిమాలు తీసి - అప్పుల పాలై...
- ●Telangana Oil Palm Cultivation | 6వ తరం హైబ్రిడ్ ఆయిల్‌పామ్ విత్తనాల ఉత్పత్తి కోసం దేశంలోనే తొలి సీడ్ గార్డెన్ ఖమ్మంలో
- ●HYD Police | శాంతిభద్రతలు, దర్యాప్తు విభజనకు శ్రీకారం
- ●KTR | రైతుబంధు ఇయ్యకుండా రాహుల్ బంధు కడుతుండు

Saudi Arabia Houthi Deal | యుద్ధం ఆపేందుకు రూ.8,400 కోట్లు?: హౌతీలతో సౌదీ సీక్రెట్ డీల్.. తెరవెనుక ఇరాన్ చక్రం!

Tiger Shroff Firing Case | టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో కీలక పరిణామం.. నిందితులందరిపై మోకా చట్టం!

Kannada Producer | కన్నడ అగ్ర నిర్మాత సిల్క్మంజు కన్నుమూత - సినిమాలు తీసి - అప్పుల పాలై...

Telangana Oil Palm Cultivation | 6వ తరం హైబ్రిడ్ ఆయిల్‌పామ్ విత్తనాల ఉత్పత్తి కోసం దేశంలోనే తొలి సీడ్ గార్డెన్ ఖమ్మంలో




