Tiger Shroff Firing Case | టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో కీలక పరిణామం.. నిందితులందరిపై మోకా చట్టం!
Tiger Shroff Firing Case | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన కాల్పుల కేసులో ముంబై పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులందరిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మోకా) కింద అభియోగాలు నమోదు చేశారు.
Entertainment | Published On Oct 27, 2026, 8.10 pm IST
Tiger Shroff Firing Case | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన కాల్పుల కేసులో ముంబై పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులందరిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మోకా) కింద అభియోగాలు నమోదు చేశారు. అక్టోబర్ 18న జరిగిన కాల్పుల ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. డీసీబీ సీఐడీ క్రైమ్ నంబర్ 143/26 కేసులో మోకా చట్టంలోని నిబంధనలను వర్తింపజేసినట్లు అధికారిక ప్రకటనలో పోలీసులు పేర్కొన్నారు. సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ చట్టాన్ని ప్రయోగించినట్లు తెలిపారు. అక్టోబర్ 19న నిందితులపై భారతీయ న్యాయ చట్టాలకు సంబంధించిన నిబంధనలు, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేయగా.. అక్టోబర్ 27న మోకా ప్రయోగానికి ఆమోదం లభించింది.
బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు?
ఈ కాల్పుల ఘటన వెనుక డబ్బు వసూలు, గ్యాంగ్ ఆధిపత్యాన్ని చాటుకోవడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం వంటి ఉద్దేశాలు ఉన్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ అనుమానిస్తోంది. నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. గ్యాంగ్ ప్రభావాన్ని విస్తరించుకోవడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, బెదిరింపుల ద్వారా డబ్బు వసూలు చేయడం లక్ష్యంగా టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనుక వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ముఠా కుట్ర ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ దాడికి అక్రమ ఆయుధాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ, ముంబయి సహా పలు ప్రాంతాల్లో విస్తరించిన అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ద్వారా ఈ కుట్రకు ప్రణాళిక రచించినట్లు అనుమానిస్తున్నారు. ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Saudi Arabia Houthi Deal | యుద్ధం ఆపేందుకు రూ.8,400 కోట్లు?: హౌతీలతో సౌదీ సీక్రెట్ డీల్.. తెరవెనుక ఇరాన్ చక్రం!
- ●Kannada Producer | కన్నడ అగ్ర నిర్మాత సిల్క్మంజు కన్నుమూత - సినిమాలు తీసి - అప్పుల పాలై...
- ●Telangana Oil Palm Cultivation | 6వ తరం హైబ్రిడ్ ఆయిల్‌పామ్ విత్తనాల ఉత్పత్తి కోసం దేశంలోనే తొలి సీడ్ గార్డెన్ ఖమ్మంలో
- ●HYD Police | శాంతిభద్రతలు, దర్యాప్తు విభజనకు శ్రీకారం
- ●KTR | రైతుబంధు ఇయ్యకుండా రాహుల్ బంధు కడుతుండు
- ●Husharu 2 | "హుషారు 2"లో ఆర్ నారాయణమూర్తి - మంచి పాత్రలు వస్తే నటిస్తానంటూ పీపుల్స్ స్టార్ కామెంట్స్

Saudi Arabia Houthi Deal | యుద్ధం ఆపేందుకు రూ.8,400 కోట్లు?: హౌతీలతో సౌదీ సీక్రెట్ డీల్.. తెరవెనుక ఇరాన్ చక్రం!

Kannada Producer | కన్నడ అగ్ర నిర్మాత సిల్క్మంజు కన్నుమూత - సినిమాలు తీసి - అప్పుల పాలై...

Telangana Oil Palm Cultivation | 6వ తరం హైబ్రిడ్ ఆయిల్‌పామ్ విత్తనాల ఉత్పత్తి కోసం దేశంలోనే తొలి సీడ్ గార్డెన్ ఖమ్మంలో

HYD Police | శాంతిభద్రతలు, దర్యాప్తు విభజనకు శ్రీకారం





