Renu Desai | గుడికి వెళ్లి పూజలు చేస్తారు… కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను పట్టించుకోరు – రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్
మగాళ్లు గుళ్లకు వెళ్లి పూజలు చేస్తుంటారు కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను మాత్రం పట్టించుకోరని రేణు దేశాయ్ అన్నది. నివేదా థామస్ హీరోయిన్‌గా నటించిన శ్రీమతి మూవీలో రేణుదేశాయ్ ఓ కీలక పాత్రలో నటించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల సమస్యలపై రేణుదేశాయ్ ఆసక్తికర కామెంట్లు చేసింది.
Entertainment | Published On Nov 29, 2026, 7.44 pm IST
Renu Desai | నివేదా థామస్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ శ్రీమతి. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 4 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాలో రేణుదేశాయ్ (Renu Desai) ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. శ్రీమతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమోషనల్‌గా మాట్లాడింది రేణు దేశాయ్.
వివక్షకు గురవుతూనే ఉన్నారు...
నేటికి ఆడవాళ్లు వివక్షకు గురవుతూనే ఉన్నారని, ఫలానా వారి కూతురు, ఫలానా వారి భర్త అంటూ స్టాంప్‌లు వేస్తున్నారని చెప్పింది. "మహిళలకు సొంత ఐడెంటిటీ లేకుండా చేస్తున్నారు. గుడికి వెళ్లి దేవతల్ని పూజిస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లని మాత్రం పట్టించుకోరు. మహిళల సమస్యల గురించి చెప్పే ఇలాంటి సినిమాలు ప్రతి భాషలో రావాలి. మహిళలు రోబోలు కాదని చాటే మూవీ. ఇంటి బాధ్యతలు చూసుకోవడం తప్పు కాదు. కానీ వాటి పేరుతో మహిళలను వారి కలల నుంచి దూరం చేయద్దనే మంచి సందేశంతో రూపొందింది . గ్రేట్ ఇండియన్ కిచెన్ తమిళం, మలయాళంలో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాను రీమేక్ చేయడం అవసరమా అని ఆలోచించకుండా మంచి కథను చెప్పాలనే నిర్మాతల ఆలోచన అభినందనీయం" అని రేణుదేశాయ్ చెప్పింది. .
ఇతర భాషలతో పోల్చకండి...
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నివేదా థామస్ (Nivetha Thomas) మాట్లాడుతూ .. ‘‘శ్రీమతి’ కథ నా మనసుకి ఎంతో నచ్చింది. పెళ్లి తర్వాత అమ్మాయి జీవితం పూర్తిగా మారుతుంది. ఇతర భాషలతో పోల్చుకొని చూడకండి. మలయాళం రీమేక్‌ను తెలుగు ఆడియెన్స్ అభిరుచులకు తగ్గట్టుగా విశ్వక్ తెరకెక్కించారు. నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా ఇది. మగాడికి వ్యతిరేకంగా కాదు.. మన వ్యవస్థలోని కట్టుబాట్లకు వ్యతిరేకంగా తీసిన సినిమా" అని తెలిపింది. మలయాళంలో విజయవంతమైన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీకి రీమేక్‌గా శ్రీమతి తెరకెక్కుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Delimitation Bill 2026 | స్టాలిన్‌ను ఒప్పించలేకపోయిన సోనియా, రాహుల్.. గంటపాటు సాగిన చర్చలు విఫలం!
- ●KTR | 90 సీట్లు కాదు.. 900 ఫీట్ల లోతున కాంగ్రెస్‌ను పాతి పెడుతాం
- ●KTR | తెలంగాణ కథలో విలన్ ముమ్మాటికీ కాంగ్రెస్సే
- ●Sukumar | కోటి రూపాయల ఛాలెంజ్ - ఓడిపోయిన డైరెక్టర్ సుకుమార్
- ●Harish Rao | దేవాదుల మోటార్లు ఆన్ చేయకుండా వరంగల్, జనగామ జిల్లాలను ఎండబెట్టారు
- ●KTR | ఎవడి భిక్ష కాదు తెలంగాణ.. దీక్షతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం

Delimitation Bill 2026 | స్టాలిన్‌ను ఒప్పించలేకపోయిన సోనియా, రాహుల్.. గంటపాటు సాగిన చర్చలు విఫలం!

KTR | 90 సీట్లు కాదు.. 900 ఫీట్ల లోతున కాంగ్రెస్‌ను పాతి పెడుతాం

KTR | తెలంగాణ కథలో విలన్ ముమ్మాటికీ కాంగ్రెస్సే

Sukumar | కోటి రూపాయల ఛాలెంజ్ - ఓడిపోయిన డైరెక్టర్ సుకుమార్





