KTR | 90 సీట్లు కాదు.. 900 ఫీట్ల లోతున కాంగ్రెస్‌ను పాతి పెడుతాం
KTR | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.. 90 సీట్లు కాదు.. 900 ఫీట్ల లోతున కాంగ్రెస్‌ను పాతి పెడుతాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
KTR | త్రినేత్ర న్యూస్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.. 90 సీట్లు కాదు.. 900 ఫీట్ల లోతున కాంగ్రెస్‌ను పాతి పెడుతాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అలుగునూరు చౌరస్తాలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నేను కేసీఆర్ సారంత మంచోణ్ణి అయితే అస్సలే కాదు! నాకు దయాదాక్షిణ్యం లేదు! ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్లకు నేను ఒక్కటే చెప్తున్నా... మేము ఉద్యమంలోంచి పుట్టిన వాళ్లం మీతో సహా. ఇయ్యాల ఎక్కువ నఖరాలు చేస్తున్న అధికారులకు కూడా నేను ఒక్కటే చెప్తున్నా. ముఖ్యంగా పోలీసోళ్లకు చెప్తా ఉన్నా. యాది పెట్టుకోండి, 500 రోజుల్లోనే కేసీఆర్ రాబోతున్నాడు! 500 రోజులే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది! కౌంట్ డౌన్ హ్యాజ్ బిగన్! కౌంట్ డౌన్ హ్యాజ్ బిగన్! కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నాడు, ఒక్కొక్కడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలా! జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నా. డ్యూటీ చేయండి, డ్యూటీ చేయండి, అతి చేయకండి! అతి ఎవడు చేసినా వదిలిపెట్టం! ఒక్కొక్కడి పేరు రాసుకొని, సప్త సముద్రాల అవతల దాక్కున్నా పట్టుకొచ్చే బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ తేల్చిచెప్పారు.
మిగిలింది 500 రోజులే!
ఇక్కడ ఉన్నది, ఎదురుంగా ఉన్నది గులాబీ సైన్యం! మన నాయకుడు చెప్పింది ఒకటే.. గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడిపోతే కుంగిపోవద్దు. మూడేళ్లు గడిచిపోయినాయి, అయిపోయినాయి, కష్టకాలం అయిపోయింది, మిగిలింది 500 రోజులే! శిశుపాలుడి తప్పులు వంద అయినట్టు కాంగ్రెస్ వాళ్ళవి కూడా దగ్గర పడ్డాయి. ప్రజలు రెడీగా ఉన్నారు సుదర్శన చక్రం పట్టుకొని కాంగ్రెస్ తల నరికేటందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి నరుకుతున్నాడు 90 సీట్లు వస్తాయట, 90 సీట్లు.. 90 సీట్లు కాదు, 900 ఫీట్ల లోతున కాంగ్రెస్‌ను పాతిపెట్టే బాధ్యత మనం తీసుకుందాం కేసీఆర్ సైనికులుగా అని కేటీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●KTR | తెలంగాణ కథలో విలన్ ముమ్మాటికీ కాంగ్రెస్సే
- ●Sukumar | కోటి రూపాయల ఛాలెంజ్ - ఓడిపోయిన డైరెక్టర్ సుకుమార్
- ●Harish Rao | దేవాదుల మోటార్లు ఆన్ చేయకుండా వరంగల్, జనగామ జిల్లాలను ఎండబెట్టారు
- ●KTR | ఎవడి భిక్ష కాదు తెలంగాణ.. దీక్షతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం
- ●Thummaluru Land Grabbing Allegations | తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. మహేశ్కుమార్ను కలిసి తుమ్మలూరు రైతులు
- ●Bigg Boss Telugu | బిగ్బాస్లో వృషకర్మ టీమ్ - శోభితపై నాగార్జున ప్రశ్న ... నాగచైతన్య ఫన్నీ ఆన్సర్

KTR | తెలంగాణ కథలో విలన్ ముమ్మాటికీ కాంగ్రెస్సే

Sukumar | కోటి రూపాయల ఛాలెంజ్ - ఓడిపోయిన డైరెక్టర్ సుకుమార్

Harish Rao | దేవాదుల మోటార్లు ఆన్ చేయకుండా వరంగల్, జనగామ జిల్లాలను ఎండబెట్టారు

KTR | ఎవడి భిక్ష కాదు తెలంగాణ.. దీక్షతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం



