Riddhi Kumar | అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్.. మనసులోని కోరికను బయటపెట్టిన యంగ్ బ్యూటీ రిద్ది కుమార్..!
Riddhi Kumar | ప్రముఖ హీరోయిన్ రేఖ బయోపిక్‌లో నటించాలని ఉందని ప్రభాస్ ‘ది రాజా సాబ్’ బ్యూటీ రిద్ది కుమార్ తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఈ బ్యూటీ ఆదివారం తన పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా తన ప్రణాళికలను షేర్ చేసుకుంది. ఈ ఏడాది నిజంగా సంతోషంగా ఉండాలని.. తన జీవితంలోని ప్రతిక్షణం ప్రస్తుతంలాగే ఉండాలని ఆకాంక్షించింది.
Entertainment | Published On Feb 23, 2026, 12.30 pm IST
Riddhi Kumar | ప్రముఖ హీరోయిన్ రేఖ బయోపిక్‌లో నటించాలని ఉందని ప్రభాస్ ‘ది రాజా సాబ్’ బ్యూటీ రిద్ది కుమార్ తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఈ బ్యూటీ ఆదివారం తన పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా తన ప్రణాళికలను షేర్ చేసుకుంది. ఈ ఏడాది నిజంగా సంతోషంగా ఉండాలని.. తన జీవితంలోని ప్రతిక్షణం ప్రస్తుతంలాగే ఉండాలని ఆకాంక్షించింది. ‘నా పుట్టిన రోజున నా ఒకే కోరిక ఏమిటంటే.. నా జీవితంలో ప్రతి క్షణం పూర్తి సంతోషంతో గడపడం.

ఆనందం అనేది కేవలం చుట్టూ జరిగే పరిస్థితులపై ఆధారపడి ఉండదు. అదొక చాయిస్. నేను సంతోషంగా, సంతృప్తిగా, ప్రస్తుతం ఉన్న క్షణంలో జీవించాలనుకుంటున్నాను. నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకుని, నా ప్రపంచంలో నేను కేంద్రమవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయంతో నా జీవితం నా ఓడలా, నేను కెప్టెన్ అన్నట్టు అనిపిస్తుంది. మనలో ఉన్న శక్తిని గ్రహించినప్పుడు, జీవితాన్ని నిజంగా ఎగ్జయిటింగ్ అనుభవించొచ్చు. నిజానికి, మనం జీవితంలో కొన్ని అత్యుత్తమ దశలలో ఉంటాం. కానీ, ఆ దశ ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఈ ఏడాది ప్రధానమైన కోరిక’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడు రేఖ బయోపిక్‌లో ఆమె పాత్రను పోషించాలని కలలుగంటున్నాను. ఏదో ఒక విధంగా ఆమె నాకు హృదయంతో బలమైన సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. చాలామంది చెప్పినట్లు మన ఎనర్జీస్, వ్యక్తిత్వ లక్షణాలు, ఫిజికల్ ఫీచర్స్ ఒకేలా ఉన్నాయి. రూపం, ప్రేరణ మాత్రమే కాకుండా ఆమె హృదయంతో నాకు ప్రత్యేక బంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏదో ఒక రోజు ఈ డ్రీమ్ రోల్ నిజమవ్వాలని ఆశిస్తున్నాను. నా అభిమానులకు ఎంతో కృతజ్ఞురాలిని. వారితో ప్రేమను పంచుకోవాలనుకుంటున్నాను. ఇటీవల చాలామంది డైరెక్ట్‌గా మెసేజ్‌లు పంపుతున్నారు. వాటిని చదివి చాలా సంతోషంగా ఉన్నాను’ అని తెలిపింది.

రిద్ది సినిమాల విషయానికి వస్తే.. 2018లో లవర్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళం, మరాఠీ, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. సూపర్‌బాయ్స్ ఆఫ్ మలేగావ్, రాధే శ్యం, సలామ్ వెంకీ, క్యాండి, క్రాష్ కోర్స్, హ్యూమన్ తదితర చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకుంది. ప్రభాస్‌తో రాధే శ్యామ్‌లో నటించిన రిద్ది.. తాజాగా మళ్లీ ‘ది రాజా సాబ్’ మూవీలో అనితగా నటించింది. అయితే, ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్న రిద్దికి నిరాశే ఎదురైంది. బాక్సాఫీస్ వద్ద మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.

Read Also :
Vijay Rashmika Wedding | అఫీషియల్ – విజయ్, రష్మిక పెళ్లి ప్రకటన వచ్చేసింది – అభిమానులు ఇచ్చిన పేరుతోనే…
Nayanthara | ఆ విషయంలో నయనతారనే టాప్ – లేడీ సూపర్‌స్టార్‌ను బీట్ చేయడం కష్టమే!
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



