త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | ఆ విష‌యంలో న‌య‌న‌తార‌నే టాప్ – లేడీ సూప‌ర్‌స్టార్‌ను బీట్ చేయ‌డం క‌ష్ట‌మే!

ద‌క్షిణాది ఇండ‌స్ట్రీలో రిచెస్ట్ హీరోయిన్స్ లిస్ట్‌లో న‌య‌న‌తార నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉంది. లేడీ సూప‌ర్ స్టార్ మొత్తం ఆస్తుల విలువ 200 కోట్ల‌కు చేరిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

N

Entertainment | Published On Feb 22, 2026, 6.41 pm IST

Nayanthara | ఆ విష‌యంలో న‌య‌న‌తార‌నే టాప్ – లేడీ సూప‌ర్‌స్టార్‌ను బీట్ చేయ‌డం క‌ష్ట‌మే!
Advertisement

Nayanthara | సాధార‌ణంగా సినిమా ఇండ‌స్ట్రీలో 40 ఏళ్లు దాటితే హీరోయిన్ల‌కు అవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మ‌ని అంటుంటారు. క‌థానాయిక పాత్ర‌ల‌కు గుడ్‌బై చెప్పి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానో , సైడ్ రోల్స్‌లోకి షిప్ట‌యిన వాళ్లు చాలానే క‌నిపిస్తారు. కానీ న‌య‌న‌తార మాత్రం ఈ రూల్‌ను తిర‌గ‌రాస్తోంది. 41 ఏళ్ల వ‌య‌సులోనూ సౌత్ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ‌...నాలుగు ఇండ‌స్ట్రీల‌లో సినిమాలు చేస్తోంది.ప్ర‌స్తుతం న‌య‌న్ చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్ట‌ర్లు కూడా లేడీ సూప‌ర్ స్టార్‌ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

200 కోట్లు....

అవ‌కాశాల్లోనే కాదు ఆస్తుల్లో కూడా న‌య‌న్ టాప్‌లో ఉంది. రిచెస్ట్ హీరోయిన్స్ లిస్ట్‌లో ద‌క్షిణాదిలో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌కు చేరుకుంది. ఇటీవ‌లే న‌య‌న‌తార మొత్తం ఆస్తుల విలువ రెండు వంద‌ల కోట్ల‌కు చేరుకున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. సంపాద‌న‌, ఆస్తుల విష‌యంలో ఆమెకు ద‌రిదాపుల్లో కూడా మిగిలిన సౌత్ హీరోయిన్లు ఎవ‌రూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. సినిమాలు, బ్రాండ్స్ ఎండార్స్‌మెంట్స్‌తో పాటు సొంత బిజినెస్‌ల ద్వారా న‌య‌న‌తార భారీగా సంపాదిస్తోన్న‌ట్లు స‌మాచారం.

రెమ్యూన‌రేష‌న్‌....

ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు న‌య‌న‌తార 10 నుంచి 12 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటోంది. సౌత్ ఇండ‌స్ట్రీలో హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్న‌ క‌థానాయిక‌ కూడా న‌య‌న‌తార‌నే కావ‌డం గ‌మ‌నార్హం. య‌శ్ టాక్సిక్ మూవీ కోసం ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం. బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్స్‌, యాడ్ షూట్స్ కోసం భారీగానే రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రిస్తుంద‌ట‌. ఇటీవ‌ల చేసిన యాభై సెకండ్ల టాటా స్కై యాడ్‌ కోసం ఏకంగా 5 కోట్లు పారితోషికం తీసుకుంద‌ని టాక్‌. రౌడీ పిక్చ‌ర్స్ పేరుతో భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను లాంఛ్ చేసింది. సినిమాల ద్వారానే కాకుండా 9స్కిన్‌, ది లిప్‌బామ్‌, ఫేమీ9 పేరుతో కాస్మోటిక్స్ బ్రాండ్స్‌ను సొంతంగా లాంఛ్ చేసింది న‌య‌న‌తార‌. చెన్నై, హైద‌రాబాద్‌, కేర‌ళ‌ల‌లో ఖ‌రీదైన ఇళ్లు, అపార్ట్‌మెంట్స్ న‌య‌న్ పేరిట ఉన్నాయి. న‌య‌న‌తార‌కు సొంతంగా యాభై కోట్ల విలువైన ప్రైవేట్ జ‌ట్ కూడా ఉంద‌ట‌. మెర్సిడెజ్‌ మేబ్యాచ్‌, బీఎమ్‌డ‌బ్ల్యూతో పాటు ఖ‌రీదైన కార్లు న‌య‌న్ గ్యారేజీలో ఉన్నాయి.
న‌య‌న్ ఆస్తులు చూసి నెటిజ‌న్ల‌తో పాటు సినీ ల‌వ‌ర్స్ షాక‌వుతున్నారు.ప్ర‌స్తుతం టాక్సిక్‌, మూక్కుత్తి అమ్మ‌న్‌, పేట్రియాట్‌, డియ‌ర్ స్టూడెంట్స్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేస్తోంది న‌య‌న‌తార‌.

Advertisement
Advertisement