త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Renu Desai | నాకు ఏ పార్టీతో సంబంధం లేదు – అవ‌న్నీ రూమ‌ర్లే – పాలిటిక్స్‌లోకి ఎంట్రీపై రేణు దేశాయ్ క్లారిటీ

పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు జ‌రుగుతోన్న ప్ర‌చారంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ఏ పొలిటిక‌ల్ పార్టీలో తాను జాయిన్ కావ‌డం లేద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అన్నారు. పాలిటిక్స్‌పై త‌న‌కు ఆస‌క్తి లేద‌ని చెప్పారు.

N

Entertainment | Published On Jan 19, 2026, 5.18 pm IST

Renu Desai | నాకు ఏ పార్టీతో సంబంధం లేదు –  అవ‌న్నీ రూమ‌ర్లే – పాలిటిక్స్‌లోకి ఎంట్రీపై రేణు దేశాయ్ క్లారిటీ
Advertisement

Renu Desai | పాలిటిక్స్ అంటే త‌న‌కు అస్స‌లు ఇష్టం లేద‌ని సినీ న‌టి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో వీధి కుక్క‌ల సంర‌క్ష‌ణ కోసం ఏర్పాటుచేసిన ఓ స‌మావేశంలో రేణుదేశాయ్ పాల్గొన్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై రేణు దేశాయ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ఈ ప్రెస్ మీట్‌తో రేణు దేశాయ్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు మొద‌ల‌య్యాయి. అందుకే తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌పై సోష‌ల్ మీడియా ద్వారా రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది.

రూమ‌ర్లు ఆపేయండి...

తాను రాజ‌కీయాల్లోకి రావ‌డం లేద‌ని అన్న‌ది. తాను ఏ పొలిటిక‌ల్ పార్టీలో జాయిన్ కావ‌డం లేద‌ని తెలిపింది. రాజ‌కీయాలంటే త‌న‌కు ఇష్టం లేద‌ని రేణు దేశాయ్ చెప్పింది. "చాలా మంది త‌ప్పుడు థంబ్‌నెయిల్స్ తో నాపై అస‌త్యాలు ప్ర‌చారాలు చేస్తున్నారు. ఈ రూమ‌ర్స్ ఇక‌పైనా ఆపేయండి. సేవా కార్య‌క్ర‌మాలు, ఎన్జీవో ప‌నుల‌తో చాలా సంతోషంగా ఉన్నా" అని రేణు దేశాయ్ తెలిపింది.

ప‌ర్స‌న‌ల్ లైఫ్‌...

త‌న‌ వ్య‌క్తిగ‌త జీవితంపై చాలా మంది అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నాను. "నాకున్న‌ తిక్క వ‌ల్లే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌న్ను వ‌దిలేశాడ‌ని కామెంట్స్ పెడుతున్నారు. . నా పిల్ల‌ల చ‌నిపోవాల‌ని కోరుకుంటున్నారు. అలాంటి మాట‌లు మాట్లాడ‌టం త‌ప్పు. నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ జోలికి రావ‌ద్దు" అని రేణు దేశాయ్ అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement