త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీకి రిలీజ్ క‌ష్టాలు – రెండు సార్లు వాయిదా?

మేరే ర‌హో సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుంది సాయిప‌ల్ల‌వి. ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీ రిలీజ్ ఇప్ప‌టికీ రెండు సార్లు వాయిదాప‌డింది. సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ రిలీజ్ విష‌యంలో అడ్డంకులు ఎదుర‌వ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Jan 2, 2026, 3.46 pm IST

Sai Pallavi |  సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీకి రిలీజ్ క‌ష్టాలు – రెండు సార్లు వాయిదా?
Advertisement

Sai Pallavi | సాయిప‌ల్ల‌వి...ఈ పేరు క‌నిపిస్తే చాలు సినిమా హిట్టే అని న‌మ్ముతుంటారు ద‌క్షిణాది ఆడియెన్స్‌. క‌థ‌ల ఎంపిక‌లో సాయిప‌ల్ల‌వి జ‌డ్జిమెంట్ అలాంటిది. హ‌య్యెస్ట్ స‌క్సెస్ రేటు ఉన్న హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. క‌థానాయిక‌లు అంటే అందంగా ఉండాల‌నే రూల్‌ను తిర‌గ‌రాసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌ల‌తో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌కు చేరుకోవ‌చ్చ‌ని నిరూపించింది.
బాలీవుడ్‌పై ఫోక‌స్‌...
ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళంలో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న‌ సాయిప‌ల్ల‌వికి ఆఫ‌ర్ల‌కు ఢోకాలేదు. కానీ వ‌చ్చిన సినిమాల‌న్నీ ఒప్పుకోకుండా మ‌న‌సుకు న‌చ్చిన‌వి మాత్ర‌మే ఎంచుకుంటుంది. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. గ‌త ఏడాది రిలీజైన తండేల్ త‌ర్వాత ద‌క్షిణాది సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన సాయిప‌ల్ల‌వి బాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టింది. మేరే ర‌హో మూవీతో హిందీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

ఆమిర్ ఖాన్ కొడుకు...

మేరే ర‌హో మూవీలో ఆమిర్ ఖాన్ త‌న‌యుడు జునైద్ ఖాన్ హీరోగా న‌టిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామా మూవీకి సునీల్ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను ఆమిర్‌ఖాన్‌తో క‌లిసి సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ మ‌న్సూర్ ఖాన్ నిర్మిస్తున్నారు. మేరే ర‌హో షూటింగ్ రెండు, మూడు నెల‌ల క్రిత‌మే పూర్త‌య్యింద‌ట‌. తొలుత న‌వంబ‌ర్‌లో ఈ సినిమాను విడుద‌ల‌చేయాల‌ని అనుకున్నారు. కానీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డం డిసెంబ‌ర్‌కు వాయిదా వేశారు.

డిసెంబ‌ర్‌లో రిలీజ్ అనుకుంటే...

డిసెంబ‌ర్‌లో మేరే ర‌హో రిలీజ్ ప‌క్కా అని ఆడియెన్స్ కూడా భావించారు. కానీ ధురంధ‌ర్ తో పాటు మ‌రికొన్ని పెద్ద సినిమాలు డిసెంబ‌ర్ బ‌రిలో నిల‌వ‌డంతో మేరే ర‌హోను విడుద‌ల‌ చేయ‌డానికి ఆమిర్‌ఖాన్ వెన‌క‌డుగు వేశార‌ట‌. భారీ సినిమాల మ‌ధ్య పోటీగా రిలీజ్ చేస్తే థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్ట‌మ‌వుతుంది. డిస్ట్రిబ్యూష‌న్‌, బిజినెస్ ప‌రంగా ఇబ్బందులు ఉంటాయ‌ని భావించి ఆమిర్‌ఖాన్ ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేసిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నెటిజ‌న్ల వాద‌న భిన్నంగా ఉంది. ఈ సినిమాను కొన‌డానికి డిస్ట్రిబ్యూట‌ర్లు ఎవ‌రూ ముందుకు రాలేద‌ని అంటున్నారు. జునైద్ ఖాన్‌కు బాలీవుడ్‌లో పెద్ద‌గా మార్కెట్ లేక‌పోవ‌డంతో పూర్తిగా సాయిప‌ల్ల‌వి క్రేజ్ మీదే ఈ సినిమా ఫ‌లితం ఆధార‌ప‌డి ఉంద‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే రెండు సార్లు రిలీజ్ డేట్ మార‌డంతో సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ రిలీజ్ ఎప్పుడ‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌ర‌ల్డ్ క‌ప్‌తో పాటు ఎగ్జామ్స్ లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మ‌రో ఆరు నెల‌ల వ‌ర‌కు ఈ సినిమా రిలీజ్‌ను హోల్డ్ చేయాల‌ని ఆమిర్ ఖాన్ భావిస్తున్నార‌ట‌. జూలైలో మేరే ర‌హో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. షూటింగ్ కంప్లీట్ అయిన త‌ర్వాత అన్ని రోజులు ఆగ‌డం అంటే రిస్క్ అనే అభిప్రాయం బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తుంది.

రామాయ‌ణ మూవీలో...

ప్ర‌స్తుతం మేరే ర‌హోతో పాటు హిందీలో రామాయ‌ణ సినిమా చేస్తోంది సాయిప‌ల్ల‌వి. ర‌ణ‌బీర్‌క‌పూర్ రాముడిగా న‌టిస్తున్న ఈ మైథ‌లాజిక‌ల్ మూవీలో సీతగా సాయిప‌ల్ల‌వి క‌నిపించ‌బోతుంది. కేజీఎఫ్ స్టార్ య‌శ్ రావ‌ణుడిగా న‌టిస్తున్న ఈ సినిమా కూడా ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. రామాయ‌ణ మూవీ రెండు పార్టులుగా దాదాపు నాలుగు వేల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోంది. నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement