RaviTeja | తెలంగాణ కథతో రవితేజ వారసుడి మూవీ – మంగ్లీ సాంగ్ రిలీజ్
రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ మారెమ్మ మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ మూవీ నుంచి సింగర్ మంగ్లీ పాడిన మారి రారా వారి అనే సాంగ్‌ను మేకర్స్ మంగళవారం రిలీజ్ చేశారు.
Entertainment | Published On Jul 7, 2026, 8.49 pm IST
RaviTeja | మాస్ మహారాజా రవితేజ సోదరుడి కొడుకు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మారెమ్మ పేరుతో విలేజ్ యాక్షన్ లవ్‌స్టోరీ చేస్తున్నాడు. మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తోంది. మారెమ్మ షూటింగ్ పూర్తయ్యింది. ఈ నెలాఖరులోనే సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మారెమ్మ నుంచి సెకండ్ సింగిల్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. మారి రారా వారి అంటూ సాగిన ఈ పాటకు మిట్లపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను మంగ్లీ ఆలపించింది. ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందించాడు.
వాస్తవిక కోణంలో...
ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో మాధవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, ఇక్కడి సామాజిక పరిస్థితులను వాస్తవిక కోణంలో ఆవిష్కరిస్తూ సాగే రూరల్ యాక్షన్ డ్రామా మూవీ ఇది. తెలంగాణ పల్లె జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా ఇందులో చూపించబోతున్నాం అని అన్నారు. ఇందులో మాధవ్ పాత్ర రా అండ్ రస్టిక్‌గా సాగుతుందని, డిఫరెంట్ పాయింట్‌తో దర్శకుడు నాగరాజు ఈ సినిమాను తెరకెక్కించారని నిర్మాత తెలిపాడు. తమిళంలో కొన్ని సినిమాలు చేశానని, మారెమ్మతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నానని దీపా బాలు అన్నది. మాధవ్ తండ్రి రఘు క్యారెక్టర్ యాక్టర్‌గా చాలా సినిమాలు చేశాడు.
;
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ – శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు – ఎందుకంటే?
జులై 10, 2026

Tollywood | మిరాయ్ బ్యూటీతో మెగా హీరో హారర్ కామెడీ మూవీ – మాస్ పోస్టర్‌తో రిలీజ్ డేట్ చెప్పేశారుగా!
జులై 10, 2026

Lenin Review | లెనిన్ రివ్యూ – అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే బోణీ కొట్టారా? లేదా?
జులై 10, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



