త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | ర‌ష్మిక పెళ్లికి మాజీ బాయ్‌ఫ్రెండ్ – ర‌క్షిత్ శెట్టి స్నేహితుడి రియాక్ష‌న్ ఇదే

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న పెళ్లి ఫిబ్ర‌వ‌రి 26న జ‌రుగ‌నుంది. పెళ్లి ప‌నుల్లో ఈ జంట ఫుల్ బిజీగా ఉన్నారు. ర‌ష్మిక పెళ్లికి ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ ర‌క్షిత్ శెట్టికి మాత్రం ఆహ్వానం అంద‌లేద‌ట. ర‌ష్మిక వెడ్డింగ్‌పై క‌న్న‌డ న‌టుడు ప్ర‌మోద్ శెట్టి చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

a

Entertainment | Published On Feb 19, 2026, 9.30 pm IST

Rashmika Mandanna | ర‌ష్మిక పెళ్లికి మాజీ బాయ్‌ఫ్రెండ్ – ర‌క్షిత్ శెట్టి స్నేహితుడి రియాక్ష‌న్ ఇదే
Advertisement

Rashmika Mandanna | విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ పెళ్లి ఫిబ్ర‌వ‌రి 26న జ‌రుగ‌నుంది. పెళ్లి ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్నాయి. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లి వేడుక జ‌రుగ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మార్చి 4న హైద‌రాబాద్‌లోని తాజ్‌కృష్ణ‌లో రిసెప్ష‌న్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశార‌ట‌. విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లి కార్డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మాజీ బాయ్‌ఫ్రెండ్‌....

కాగా ర‌ష్మిక పెళ్లికి ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ ర‌క్షిత్ శెట్టి అటెండ్ అవుతాడా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ర‌క్షిత్ శెట్టి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌న్న‌డ మూవీ కిరిక్ పార్టీతోనే హీరోయిన్‌గా ర‌ష్మిక కెరీర్ ప్రారంభ‌మైంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ర‌క్షిత్ శెట్టి, ర‌ష్మిక మంద‌న్న మ‌ధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ‌కు పెద్ద‌లు అంగీక‌రించ‌డంతో 2017లో ఈ జంట ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జ‌రిగింది. కానీ మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగానే పెళ్లి పీట‌లు ఎక్క‌క‌ముందే వీరి ల‌వ్‌స్టోరీకి బ్రేక‌ప్ ప‌డింది. తాము విడిపోతున్న‌ట్లుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇద్ద‌రూ ప్ర‌క‌టించారు. ఛ‌లో మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక అతి త‌క్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. త‌న కెరీర్‌కు పెళ్లి అడ్డంకిగా మారుతుంద‌నే ర‌ష్మిక‌నే ర‌క్షిత్ శెట్టికి బ్రేక‌ప్ చెప్పిందంటూ అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. ర‌క్షిత్ అభిమానులు ర‌ష్మిక‌ను తెగ ట్రోల్ చేశారు.

ర‌క్షిత్ శెట్టి మిస్సింగ్‌...

కాగా విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లికి కన్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి కూడా కొంద‌రు సెలిబ్రిటీలు అటెండ్ కానున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అయితే ఈ లిస్ట్‌లో ర‌క్షిత్ శెట్టి లేడ‌ట‌. విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లికి అత‌డికి ఆహ్వానం అంద‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని ర‌క్షిత్ శెట్టి క్లోజ్‌ఫ్రెండ్ ప్ర‌మోద్ శెట్టి వెల్ల‌డించాడు. త‌మ‌కు ర‌ష్మిక వెడ్డింగ్ కార్డ్ ఇంకా అంద‌లేద‌ని అన్నాడు. "ఒకవేళ ర‌ష్మిక ఆహ్వానిస్తే తప్పకుండా పెళ్లికి వెళ్తాము. అయినా ర‌ష్మిక నుంచి మాకు పిలుపు వ‌స్తుంద‌ని అనుకోవ‌డం లేదు" అని అన్నాడు.

సినిమాల‌పైనే ఫోక‌స్‌...

"ర‌క్షిత్ శెట్టి ఫోక‌స్ మొత్తం ప్ర‌స్తుతం సినిమాల‌పైనే ఉంది. దేని గురించి బాధ‌ప‌డే టైప్ కాదు. గ‌తాన్ని అస్స‌లు ప‌ట్టించుకోడు. కొత్త సినిమా క‌థ రాసుకుంటూ ప్ర‌శాంతంగా ఉన్నాడు" అంటూ త‌న స్నేహితుడి గురించి కూడా ప్ర‌మోద్ శెట్టి కామెంట్స్ చేశాడు. ర‌ష్మిక పెళ్లితో పాటు ర‌క్షిత్ శెట్టి గురించి ప్ర‌మోద్ శెట్టి చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.
కిరిక్ పార్టీలో ర‌క్షిత్ శెట్టి, ర‌ష్మిక మంద‌న్న‌ల‌తో క‌లిసి ప్ర‌మోద్ శెట్టి న‌టించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ర‌క్షిత్ శెట్టి ప్ర‌తి సినిమాలో అత‌డు క‌నిపించాడు.

Advertisement
Advertisement