Rashmika Mandanna | రష్మిక తగ్గేదేలే – పెళ్లి తర్వాత మరింత పెరిగిన తెలంగాణ కోడలి బ్రాండ్ వాల్యూ
ఇటీవల విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. పెళ్లి తర్వాత రష్మిక బ్రాండ్ వాల్యూ డబుల్ అయ్యిందట. ఆమెతో యాడ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ డీల్స్ కుదర్చుకోవడానికి పలు కంపెనీలు క్యూ కడుతున్నాయని అంటున్నారు.
Entertainment | Published On Mar 3, 2026, 2.21 pm IST
Rashmika Mandanna | పెళ్లి చేసుకుంటే హీరోయిన్ల కెరీర్ డౌన్ అవుతుందనే అపోహ సినీ పరిశ్రమలో బలంగా కనిపిస్తుంది. పెళ్లి తర్వాత అవకాశాల విషయంలోనే కాకుండా కథానాయికల క్రేజ్, ఇమేజ్ తగ్గుతాయని అంటుంటారు. కానీ తెలంగాణ కోడలు రష్మిక బ్యాండ్ వాల్యూతో పాటు స్టార్‌డమ్ పెళ్లి తర్వాత రెట్టింపు అయ్యాయని సినీ వర్గాలు చెబుతోన్నాయి.
గ్రాండ్‌గా పెళ్లి....
ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. సంగీత్ నుంచి సోమవారం జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతం వరకు తమ పెళ్లి వేడుకల తాలుకూ సంగతులను అభిమానులతో పంచుకున్నారు ఈ జంట. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ కొత్త జంట గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. గత కొద్ది రోజులుగా విరోష్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
కోహ్లి తర్వాత రష్మికనే...
ఇటీవల తమ పెళ్లి ఫొటోలను విజయ్‌తో పాటు రష్మిక కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రష్మిక పోస్ట్‌కు ఏకంగా 25 మిలియన్ల లైక్స్ వచ్చాయి. విరాట్ కోహ్లి పెళ్లి ఫొటోల కంటే ఎక్కువ లైక్స్‌తో రష్మిక రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియన్ లెవెల్‌లో రష్మికకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనమిదని నెటిజన్లు అంటున్నారు. నయనతార, అలియాభట్, దీపికా పదుకోనేతో పాటు చాలా మంది హీరోయిన్లు పెళ్లిచేసుకున్నారు. కానీ ఎవరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఇంతలా డిస్కషన్స్ నడవలేదు. ఫొటోలు ట్రెండ్ కాలేదు. కానీ విజయ్, రష్మిక పెళ్లి జరిగి ఐదు రోజుల అవుతోన్న ఇప్పటికీ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు అన్ని భాషల ఫ్యాన్స్ ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారట.
క్యూ కడుతున్న ఆఫర్లు...
పెళ్లితో రష్మిక బ్రాండ్ వాల్యూ మరింత పెరిగిందని అంటున్నారు. సినిమా ఆఫర్లు మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, యాడ్స్ ఆఫర్లు క్యూ కడుతున్నాయట. ఇటీవలే భర్త విజయ్ దేవరకొండతో ఓ యాడ్‌లో కలిసి నటించింది. వీటితో పాటు పెళ్లికి వారం, పది రోజుల ముందే రణవీర్‌సింగ్‌తో పాటు టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్‌గిల్‌తో కలిసి రెండు యాడ్ ఫిల్మ్స్ రష్మిక చేసినట్లు చెబుతోన్నారు. వీటికోసం భారీగానే రష్మిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇవే కాకుండా మరికొన్ని నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా రష్మిక డీల్‌కుదుర్చుకున్నట్లు సమాచారం. పెళ్లి కారణంగా రష్మిక పేరు అన్ని భాషల్లో బాగా వినిపిస్తోంది. ఈ టైమ్‌లోనే ఆమెతో యాడ్స్ చేస్తే రీచ్ ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయంలో మార్కెట్ వర్గాలు ఉన్నట్లు చెబుతోన్నారు.
సినిమాల పరంగానూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి సినిమా చేస్తోంది. మైసా పేరుతో రష్మిక చేసిన ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది. హిందీలో కాక్ టెయిల్ 2లో నటిస్తోంది. వీటితో పాటు మరో మూడు సినిమాలు రష్మిక అంగీకరించినట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | హీరోయిన్ అందాన్ని పొగుడుతూ నోరుజారిన రష్మిక – బోల్డ్ కామెంట్స్ వైరల్
మే 18, 2026

Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
మే 10, 2026

Vijay Deverakonda | విజయ్ దేవరకొండ బర్త్‌డే సర్ప్రైజ్ – చేతిలో గన్‌తో రౌడీ జనార్ధన… రొమాంటిక్ పోస్టర్ రిలీజ్
మే 9, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



