Yellamma Movie | ప్రభాస్ ‘స్పిరిట్’ ప్లేస్‌లో దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఎల్లమ్మ మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. 2027 మార్చి 5న ఎల్లమ్మ థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ స్పిరిట్ వాయిదా పడటంతో ఆ డేట్‌కు ఎల్లమ్మ రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Oct 20, 2026, 4.44 pm IST
Yellamma Movie | ప్రభాస్ హీరోగా నటిస్తోన్న స్పిరిట్ మూవీ మార్చి 5న థియేటర్లలోకి రావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల దీపావళికి ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ వదులుకున్న డేట్‌కు దేవిశ్రీప్రసాద్ సినిమా రిలీజ్ అవుతోంది. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఎల్లమ్మ మూవీతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఐదు భాషల్లో రిలీజ్...
దసరా సందర్భంగా ఎల్లమ్మ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. 2027 మార్చి 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాలం, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో...
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డప్పు వాయిద్య కళాకారుడి జీవితంచుట్టూ సాగే కథతో ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు వేణు ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ప్రస్తుతం ఎల్లమ్మ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్....
హీరోగా నటిస్తూనే ఎల్లమ్మ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్‌తో పాటు పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారం జరిగాయి. చివరకు అనంతిక సనీల్ కుమార్‌ను ఫిక్స్ చేశారు. బలగం తర్వాత వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana | తెలంగాణ కథతో మంచు మనోజ్ మైథాలజీ మూవీ – డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ శిష్యుడు
అక్టోబర్ 20, 2026

Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ – దసరా రోజు చిన్న సినిమాలకు షాకిచ్చిన వెంకటేష్
అక్టోబర్ 20, 2026

Sanju Samson | రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!
అక్టోబర్ 20, 2026
తాజావార్తలు
- ●Nalamasa Srikanth Goud | దసరా వేళ కవిత కీలక ప్రకటన.. టీఆర్ఎస్ తొలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నలమాస శ్రీకాంత్ గౌడ్
- ●Abhijit Dipke | దీపావళి వరకూ ఎలాంటి నిరసనలు లేవు.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి.. మద్దతుదారులకు దిప్కే పిలుపు
- ●Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ - ఫస్ట్ నైట్ రోజే భార్య కిడ్నాప్ అయితే!
- ●Gold Mine Collapse | కూలిన బంగారు గని.. 14 మంది మృతి
- ●Sadu Mata | అక్కడ మగవాళ్లు చీరలు కట్టుకుని గర్భా ఎందుకు ఆడతారు..? దీని వెనుకున్న అసలు కథ ఇదే..!
- ●Telangana | తెలంగాణ కథతో మంచు మనోజ్ మైథాలజీ మూవీ - డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ శిష్యుడు

Nalamasa Srikanth Goud | దసరా వేళ కవిత కీలక ప్రకటన.. టీఆర్ఎస్ తొలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నలమాస శ్రీకాంత్ గౌడ్

Abhijit Dipke | దీపావళి వరకూ ఎలాంటి నిరసనలు లేవు.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి.. మద్దతుదారులకు దిప్కే పిలుపు

Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ - ఫస్ట్ నైట్ రోజే భార్య కిడ్నాప్ అయితే!

Gold Mine Collapse | కూలిన బంగారు గని.. 14 మంది మృతి



