త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | క‌థ ఒక‌టి చెప్పి సినిమా మ‌రోలా తీశారు – స‌ల్మాన్ ఖాన్ డిజాస్ట‌ర్ మూవీపై ర‌ష్మిక మంద‌న్న కామెంట్స్

స‌ల్మాన్ ఖాన్ సికంద‌ర్ మూవీపై ర‌ష్మిక మంద‌న్న చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. క‌థ ఒక‌టి చెప్పి సినిమాను మ‌రోలా తీశార‌ని అన్న‌ది. ఈ మార్పుల వ‌ల్లే సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచింద‌ని అని ర‌ష్మిక ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

N

Entertainment | Published On Jan 19, 2026, 11.59 am IST

Rashmika Mandanna | క‌థ ఒక‌టి చెప్పి సినిమా మ‌రోలా తీశారు – స‌ల్మాన్ ఖాన్ డిజాస్ట‌ర్ మూవీపై ర‌ష్మిక మంద‌న్న కామెంట్స్
Advertisement

Rashmika Mandanna | స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) సికంద‌ర్ మూవీపై ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) చేసిన కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. సికంద‌ర్‌కు సంబంధించి తాను విన్న క‌థ‌కు, తీసిన సినిమాకు ఏ మాత్రం సంబంధం లేద‌ని ర‌ష్మిక అన్న‌ది. గ‌త ఏడాది టాలీవుడ్‌, బాలీవుడ్‌లో క‌లిపి ఐదు సినిమాలు చేసింది ర‌ష్మిక మంద‌న్న‌. హిందీ సినిమాలు ఛావా, థామాతో పాటు తెలుగు సినిమాలు ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌, కుబేర బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. స‌ల్మాన్ ఖాన్‌కు జోడీగా న‌టించిన సికంద‌ర్ మాత్రం డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఏఆర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న‌ను అనౌన్స్‌చేయ‌డంపై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. స‌ల్మాన్ ఖాన్‌, ర‌ష్మిక మంద‌న్న ఏజ్ గ్యాప్‌ను హైలైట్ చేస్తూ ఫ్యాన్స్‌ ట్రోల్స్ చేశారు.

క‌థ వేరు...

తాజాగా సికంద‌ర్ డిజాస్ట‌ర్‌పై ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక మంద‌న్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. క‌థ ఒక‌టి చెప్పి సినిమాను మ‌రోలా తీశార‌ని అన్న‌ది. "సికింద‌ర్ క‌థ‌తో మురుగ‌దాస్ న‌న్ను క‌లిశారు. ఆయ‌న చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమాను అంగీక‌రించా. కానీ స్క్రీన్‌పైకి వ‌చ్చే స‌రికి చాలా మారిపోయింది. నేను విన్న క‌థ కాకుండా మ‌రో స్టోరీతో సినిమా తీసిన‌ట్లు అనిపించింది. షూటింగ్ మ‌ధ్య‌లోనే చాలా మార్పులు చేశారు. స్టార్ హీరోల సినిమాల విష‌యంలో ఇలాంటి ఛేంజెస్ జ‌ర‌గ‌డం సాధార‌ణ‌మే. ప‌ర్ఫార్మెన్స్‌, ఎడిటింగ్‌, రిలీజ్ డేట్‌, ...ఇలా చాలా అంశాల ప్ర‌భావం వ‌ల్ల ముందుగా అనుకున్న క‌థ‌ల‌కు త‌గ్గ‌ట్లు సినిమాలు ఉండ‌వు. ఓ క‌థ అనుకోని మ‌రోలా తీయాల్సిన ప‌రిస్థితులు వ‌స్తాయి. సికింద‌ర్ విష‌యంలో అదే జ‌రిగింది. అందుకే సినిమా రిజ‌ల్ట్ పాజిటివ్‌గా రాలేదు" అని ర‌ష్మిక మంద‌న్న చెప్పింది. ఆమె కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.
దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన సికంద‌ర్‌ 150 కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. స‌ల్మాన్ ఖాన్ ఇమేజ్ కార‌ణంగా డిజాస్ట‌ర్ టాక్‌తో భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement