త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | కాంగ్రెసోళ్లు ఢిల్లీల తాగి కొట్టుకున్న‌ర‌ట‌.. ఈరోజు న్యూసంతా అదే

RS Praveen Kumar | ఈరోజు ఢిల్లీల కాంగ్రెస్ మంత్రి, ఎమ్మెల్యే తాగి కొట్లాడుకున్నార‌ని.. ఈరోజు న్యూసంతా అదేన‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు.

S

Telangana | Published On Nov 2, 2026, 7.06 pm IST

RS Praveen Kumar | కాంగ్రెసోళ్లు ఢిల్లీల తాగి కొట్టుకున్న‌ర‌ట‌.. ఈరోజు న్యూసంతా అదే
Advertisement
  • ఇది అబ‌ద్ద‌మైతే న‌న్ను ఉరిదీసి అల్వాల చెర్వుల ప‌డేయిర్రి
  • రేవంత్‌రెడ్డి, మేఘారెడ్డిని గెలిపిస్తే మూట‌లు మోస్తున్న‌రు
  • వ‌న‌ప‌ర్తి రైతు స‌భ‌లో ఆర్ఎస్ ప్ర‌వీణ్ సెటైర్లు

RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్‌: ఈరోజు ఢిల్లీల కాంగ్రెస్ మంత్రి, ఎమ్మెల్యే తాగి కొట్లాడుకున్నార‌ని.. ఈరోజు న్యూసంతా అదేన‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. ఇది అబ‌ద్ద‌మైతే న‌న్ను ఉరిదీసి అల్వాల చెర్వుల ప‌డేయండ‌న్నారు. క‌ష్టాలు, క‌న్నీళ్లు చూస్త‌ర‌ని రేవంత్‌రెడ్డి, మేఘారెడ్డిని గెలిపిస్తే ఢిల్లీకి మూట‌లు మోయ‌డానికే స‌రిపోతున్నార‌ని విమ‌ర్శించారు. సోమ‌వారం వ‌న‌ప‌ర్తి (Wanaparthy) జిల్లాలో నిర్వ‌హించిన రైతు స‌భ‌ (Farmers' Meeting)లో ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్ర‌తినిధుల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

మ‌న క‌ష్టాల‌ను తెల్సుకొని హ‌రీశ్ రావు ఇక్క‌డికొచ్చిండు. రేవంత్‌రెడ్డి గ‌ల్ల వ‌ట్టుకొని అడ‌గ‌డానికి వ‌చ్చిండు. అల్వాల చెరువు దాటిపోయి ఎండిన పొలాల‌ను చూసినం. కొండ‌న్న అనే రైతు ఆరు ఎక‌రాల్లో వ‌రి నాటేసినా అని చెప్పిండు. రెండున్న‌ర ల‌క్ష‌ల అప్పు చేసిండు. రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డా అని చెప్తుండు. ఈరోజు నీళ్లు లేక పొలం ఎండిపోయిందని బాధ ప‌డుతుండు.

180 ఎంఎల్ తాగి కొట్టుకున్న‌ర‌ట‌

రేవంత్‌రెడ్డి 82 సార్లు ఢిల్లీకి మూట‌లు మోసిండు. క‌ష్టాలు, క‌న్నీళ్లు తుడుస్త‌ర‌ని మేఘారెడ్డిని, రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే ఢిల్లీకి పోయి క‌ప్పం క‌డుతున్న‌రు. ఈరోజు పొద్దున ఒక న్యూస్ విన్నా.. కాంగ్రెస్‌ మంత్రి ఒక‌రు, ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇక్క‌డ తిన్న‌ది సాల‌క‌ ఢిల్లీలోని హోట‌ళ్ల కూసోని కొట్లాడుకున్న‌ర‌ట‌. 90 ఎంఎల్ కాదు 180 ఎంఎల్ తాగి కొట్టుకున్న‌ర‌ట‌. నేన్ చెప్పింది త‌ప్ప‌యితే న‌న్ను ఉరితీసి మీ అల్వాల చెరువ‌ల ప‌డేయిర్రి. ఈరోజు న్యూస్ అంతా అదే. మూట‌ల పంచాయితీల కొట్టుకున్న‌రు. ఢిల్లీల తాగి తందానాలు ఆడుతున్న‌రు.

కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌నం మేర‌కు ఈరోజు హ‌రీశ్‌రావును ఇక్క‌డికి పంపించిండు. రాత్రింబ‌వ‌ళ్లు ప‌ని చేసి కాళేశ్వ‌రం, పాల‌మూరు-రంగారెడ్డి వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు క‌ట్టిండ్రు. ఒక తల్లి బిడ్డ‌ను క‌నాలంటే 9 నెల‌లు బిడ్డ‌ను క‌డుపుల మోస్త‌ది. కాన్పు ఎట్ల‌యిత‌దో తెల్వ‌దు. స‌స్త‌మో బ‌తుకుత‌మో తెల్వ‌దు.. ఇటువంటి ప‌రిస్థితుల్లో త‌ల్లి గ‌ర్భం దాలుస్త‌ది. అట్ల‌నే కేసీఆర్ కూడా నిద్రాహారాలు మాని కాళేశ్వ‌రం క‌డితే బాంబులు పెట్టి పేల్చారు. ఈ విష‌యం ఇంజినీర్లే చెప్పిర్రు. ఈ కేసును మూడేండ్ల నుంచి ద‌ర్యాప్తు చేస్త‌లేరు. వేల కోట్ల ఇసుక దందా కోసం ప్రాజెక్టుల‌ను పేల్చేసిండ్రు అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ ఆరోపించారు.

ట్యాగ్స్:

Farmers MeetingMeghareddyRevanth ReddyRS Praveen KumarTelanganaWanaparthy
Advertisement
Advertisement