Amit Shah | కాంగ్రెస్..వెంటిలేటర్ పార్టీ
Amit Shah | 64 ఏళ్ల నుంచి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అసలు అధికారంలో లేనే లేదు. 54 ఏళ్లుగా బెంగాల్ లో ఆ పార్టీకి మనుగడే లేదు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లో వాళ్లు గెలిచి 41 ఏళ్లు దాటిపోయింది. త్రిపుర, ఒడిశాలలో 26 ఏళ్ల నుంచి గెలిచేందుకు ఆపసోపాలు పడుతున్నది. ఈ దేశం నుంచి కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా మాయమవుతూ వస్తున్నది.
- దేశం నుంచి క్రమంగా మాయమవుతున్నది
- తెలంగాణ నుంచి కూడా సమూలంగా పెకిలించివేయండి
- చొరబాటుదారుల ఓట్ల కోసం కాంగ్రెస్ కంపెనీ తాపత్రయం
- దేశవాసులే ఓటు వేసేలా.. సర్ కు మద్దతు ఇవ్వండి
- వచ్చేసారి బీజేపీ సర్కారు ఏర్పాటయ్యేలా కార్యకర్తలు సంకల్పించుకోవాలి
- లోక్ తంత్ర బచావో ర్యాలీలో హోంమంత్రి అమిత్ షా
త్రినేత్ర న్యూస్ : 64 ఏళ్ల నుంచి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అసలు అధికారంలో లేనే లేదు. 54 ఏళ్లుగా బెంగాల్ లో ఆ పార్టీకి మనుగడే లేదు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లో వాళ్లు గెలిచి 41 ఏళ్లు దాటిపోయింది. త్రిపుర, ఒడిశాలలో 26 ఏళ్ల నుంచి గెలిచేందుకు ఆపసోపాలు పడుతున్నది. ఈ దేశం నుంచి కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా మాయమవుతూ వస్తున్నది. వెంటిలేటర్ పై ఉన్న ఆ పార్టీ మాతో పోటీ పడగలదా?..అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చురకలు అంటించారు. సర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిరసనలకు పోటీగా.. లోక్ తంత్ర్ బచావో అరాజకతా హఠావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం..అరాచకీయాన్ని నశింపజేద్దాం) పేరుతో దేశ వ్యాప్తంగా బీజేపీ ర్యాలీలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో సోమవారం (నవంబర్ 2) ఆబిడ్స్ లో నిర్వహించిన మహా పాదయాత్రలో బీజేపీ ఎంపీలు, రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం నిజాం కాలేజీ వద్ద నిర్వహించిన సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆ 13 కోట్ల ఓట్లు..ఎందుకు తొలగించారంటే

దేశవాసులు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండేలా ఉద్దేశించిన సర్ ప్రక్రియపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దుష్ప్రచారం చేస్తున్నారని అమిత్ షా విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. "సర్ పై రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. 13 కోట్ల ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నాడు. అయితే ఇందులో 6.5 కోట్ల మంది ఓటర్లు తాము ఉంటున్న ప్రదేశం నుంచి మరో చోటికి వెళ్లిపోయారు. అటువంటప్పుడు వాళ్లు రెండు చోట్లు ఓట్లు వేయలేరు కదా. మరో 2.8 కోట్ల మంది ఓటర్లు చనిపోయారు. చనిపోయిన వాళ్ల ఓట్లు తొలగించాలా వద్దా? ఇంకో కోటి ఓట్లు డూప్లికేట్ ఎంట్రీ అయి ఉన్నాయి. మరో 3 కోట్ల ఓట్లు చొరబాటు దారులవి. ఇవన్నీ తొలగించాలా వద్దా?. వీటన్నింటినీ తొలగించొద్దని రాహుల్ అంటాడు. సర్ వల్లే బీజేపీ గెలిచిందని పదే పదే అంటున్నాడు. 2014లో, 2019లో, 2024లో మేం గెలిచినప్పుడు సర్ ఎక్కడిది? సర్ లేకుండానే హరియాణా, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర, బెంగాల్, అసోంలలో గెలిచాం కదా. కాంగ్రెస్ కంపెనీని..సర్ ను ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కానీ బీజేపీ కార్యకర్తలు సర్ కు మద్దతుగా నిలబడితే.. దేశవాసులు మాత్రమే ఓటు వేయగలరు" అని అమిత్ షా అన్నారు.
గెలిస్తే జనం వల్ల.. ఓడితే ఈవీఎం వల్లనా?

రాహుల్ గాంధీ పదే పదే ఈవీఎంల పై దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ అమిత్ షా మండిపడ్డారు. "నిజంగా ఈవీఎంలో లోపాలు ఉంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి..సీఎం ఎలా అయ్యాడు? కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది? హిమాచల్ లో మీ ప్రభుత్వమే ఏర్పాటైంది? తమిళనాడు మీ కూటమి ప్రభుత్వం ఎలా అధికారంలో ఉంది?
గెలిచినప్పుడు.. జనం వల్ల గెలిచాం..అంటారు. ఓడినప్పుడు మాత్రం..ఈవీఎం వల్ల అంటారు. కాంగ్రెస్ పదేళ్లు పాలించి 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసింది. మోదీ పాలనలో చారాణా అవినీతి కూడా జరగలేదు. తెలంగాణలో కూడా ఆర్ ఆర్ ట్యాక్స్ అమలవుతున్నది. కుంభకోణాల మాటున తెలంగాణను అమ్మేస్తున్నారు. ఆరు గ్యారంటీలని చెప్పారు. కానీ ఒక్కటీ సరిగ్గా అమలు కావడం లేదు. మోదీ నాయకత్వంలోనే తెలంగాణను కాపాడుకోగలం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను సమూలంగా పెకిలించి వేద్దాం. మంచి మెజారిటీతో బీజేపీ సర్కారును ఏర్పాటు చేద్దాం " అని హోం మంత్రి అమిత్ షా..కార్యకర్తలకు పిలుపునిచ్చి ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు కే లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Abdullah Family Kashmiri Pandit Roots | నిధి రజ్దాన్‌తో ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి: కశ్మీరీ పండిట్లతో అబ్దుల్లా కుటుంబానికి ఉన్న శతాబ్దాల బంధం ఏమిటి?
- ●RS Praveen Kumar | కాంగ్రెసోళ్లు ఢిల్లీల తాగి కొట్టుకున్నరట.. ఈరోజు న్యూసంతా అదే
- ●Kajal Aggarwal | భర్తతో కాజల్ రొమాంటిక్ ఫొటోషూట్ - "దాదా" షూటింగ్‌కు బ్రేక్
- ●Ponnam Prabhakar | అమిత్ షా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితం
- ●Harish Rao | ఎండిన పంటలను పరిశీలిస్తూ.. అండగా ఉంటామని భరోసానిస్తూ
- ●Sreeleela | రూమర్లకు చెక్ పెట్టిన శ్రీలీల - సెట్స్‌పైకి తమిళ మూవీ - నిర్మాతగా కోలీవుడ్ స్టార్ హీరో భార్య

Abdullah Family Kashmiri Pandit Roots | నిధి రజ్దాన్‌తో ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి: కశ్మీరీ పండిట్లతో అబ్దుల్లా కుటుంబానికి ఉన్న శతాబ్దాల బంధం ఏమిటి?

RS Praveen Kumar | కాంగ్రెసోళ్లు ఢిల్లీల తాగి కొట్టుకున్నరట.. ఈరోజు న్యూసంతా అదే

Kajal Aggarwal | భర్తతో కాజల్ రొమాంటిక్ ఫొటోషూట్ - "దాదా" షూటింగ్‌కు బ్రేక్

Ponnam Prabhakar | అమిత్ షా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితం





