Rashmika Mandanna | నీపై నాకున్న ప్రేమను చెప్పడానికి మాటలు సరిపోవు – పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ పోస్ట్…
పెళ్లి తర్వాత రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నిజమైన ప్రేమను ఎలా ఉంటుందో నాకు నేర్పిన వ్యక్తి విజయ్ అంటూ ఈ పోస్ట్‌లో రష్మిక పేర్కొన్నది. నీపై నాకున్న ప్రేమను వర్ణించడానికి మాటలు సరిపోవు అంటూ ఈ పోస్ట్‌లో రష్మిక చెప్పింది. పెళ్లి తర్వాత రష్మిక చేసిన ఫస్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Feb 26, 2026, 8.12 pm IST
Rashmika Mandanna | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. గురువారం ఉదయ్‌పూర్‌లోని మెమోంటోస్ హోటల్‌లో వైభవంగా జరిగింది. పెళ్లి ఫొటోలను విజయ్, రష్మిక అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైర్ అవుతోన్నాయి. తమ పెళ్లి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
నా భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నా అంటూ ఈ పోస్ట్‌లో రష్మిక మందన్న పేర్కొన్నది.
నిజమైన ప్రేమ అంటే...
"నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో నాకు నేర్పిన వ్యక్తి.. ప్రశాంతత అంటే ఏంటో పరిచయం చేసిన మనిషి.పెద్ద కలలు కనడం, లక్ష్యాలు గొప్పగా ఉండాలని నాకు చెప్పిన వ్యక్తి. నా ఊహకు అందని విజయాలను కూడా నేను సాధించగలనని ప్రతిరోజూ నాకు గుర్తుచేస్తూ....నన్ను ప్రోత్సహించే నా తోడు. నా భావాలను ఎప్పుడూ వ్యక్తపరిచినా అడ్డుచెప్పని వ్యక్తి. స్నేహితులతో ప్రయాణాలు చేయడం ఎంత గొప్పగా ఉంటుందో నేర్పిన వ్యక్తి. నిజంగా చెప్పాలంటే, తన గురించి నేను ఒక పుస్తకమే రాయగలను" అని రష్మిక అన్నది.
మాటలు చాలవు...
"ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే దానికి కారణం తనే. నేను కన్న కలలను సాకారం చేసింది నువ్వే. నేను నిజంగా ఎంతో అదృష్టవంతురాలిని. విజ్జూ... నీపై నాకున్న ప్రేమని వర్ణించడానికి , భావాలను వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవు. జీవితంలో అనుకోకుండా వచ్చే విజయాలు, నా పోరాటాలు, సంతోషం, బాధ.. అన్నీ నీకు తెలుసు. ఇకపై ప్రతీదీ ఎంతో అందంగా, అర్థవంతంగా ఉంటుంది. నా జీవితంలో ప్రతి క్షణానికి ఒక అర్థం దొరికిందంటే అది నువ్వు నా పక్కన ఉండటం వల్లే. నీ భార్యగా పిలిపించుకోవడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఇక మన ఇద్దరి జీవితం ఒక పెద్ద పండుగలా ఉండబోతోంది. పద... మనమిద్దరం కలిసి ఒక అద్భుతమైన జీవితాన్ని గడుపుదాం" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. రష్మిక పోస్ట్ వైరల్ అవుతోంది.
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | హీరోయిన్ అందాన్ని పొగుడుతూ నోరుజారిన రష్మిక – బోల్డ్ కామెంట్స్ వైరల్
మే 18, 2026

Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
మే 10, 2026

Vijay Deverakonda | విజయ్ దేవరకొండ బర్త్‌డే సర్ప్రైజ్ – చేతిలో గన్‌తో రౌడీ జనార్ధన… రొమాంటిక్ పోస్టర్ రిలీజ్
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



