త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | నేషనల్ క్రష్ కోసం సెంటిమెంట్ బ్రేక్ – రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ సినిమాపై కొత్త బ‌జ్‌

కెరీర్ ఆరంభం నుంచి హీరోయిన్ల విష‌యంలో తాను పాటిస్తున్న ఓ సెంటిమెంట్‌ను ఆర్‌సీ 17తో డైరెక్ట‌ర్ సుకుమార్‌ బ్రేక్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఫ‌స్ట్ టైమ్ ఓ హీరోయిన్‌ను రిపీట్ చేయ‌నున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియ‌న్ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఫైన‌ల్ అయిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Jul 21, 2026, 5.29 pm IST

Rashmika Mandanna | నేషనల్ క్రష్  కోసం సెంటిమెంట్ బ్రేక్   – రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ సినిమాపై కొత్త బ‌జ్‌
Advertisement

Rashmika Mandanna |  తొలి మూవీ ఆర్య నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాల్లో హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌లేదు సుకుమార్‌. ఆర్‌సీ 17తో ఫ‌స్ట్ టైమ్ ఆ సెంటిమెంట్‌ను ప‌క్క‌న‌పెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పుష్ప‌, పుష్ప 2 సినిమాల‌తో డైరెక్ట‌ర్‌గా బిగ్గెస్ట్ హిట్స్‌ను అందుకున్నాడు సుకుమార్‌. పుష్ప 2 సినిమాకుగాను బెస్ట్ స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డును ద‌క్కించుకున్నాడు.

న‌వంబ‌ర్ నుంచి....

పుష్ప 2 త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో సుకుమార్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. పుష్ప 2 కంటే ముందే ఈ కాంబినేష‌న్ ఫిక్స‌య్యింది. స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌ను సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించ‌బోతున్నారు. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం.

ఆర్‌సీ 17...

ఆర్‌సీ 17 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న‌ ఈ మూవీ కోసం ప్ర‌స్తుతం హీరోయిన్‌ను ఫైన‌లైజ్ చేసే ప‌నిలో సుకుమార్ బిజీగా ఉన్నారు. తొలుత కృతి స‌న‌న్‌ను క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని భావించారు. ఆమెపై ఓ లుక్ టెస్ట్ కూడా చేసిన‌ట్లు తెలిసింది. ఆ త‌ర్వాత రుక్మిణి వ‌సంత్ కూడా ఆడిష‌న్‌కు అటెండ్ అయిన‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రి విష‌యంలో సుకుమార్ అసంతృప్తిగా ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ర‌ష్మిక ఛాయిస్‌...

రామ్‌చ‌ర‌ణ్ మూవీలో హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న‌ను కూడా ఓ ఛాయిస్‌గా సుకుమార్ భావిస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు త‌న సినిమాల్లో హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌ని సుకుమార్‌....ఫ‌స్ట్ టైమ్ ఆర్‌సీ 17తో ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయ‌బోతున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. దాదాపు నేష‌న‌ల్ క్ర‌ష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫైన‌ల్ అయిన‌ట్లేన‌ని అంటున్నారు.

ఫ‌స్ట్ టైమ్‌...

మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌ష్మిక మంద‌న్న ఇప్ప‌టివ‌ర‌కు సినిమా చేయ‌లేదు. ఫ‌స్ట్ టైమ్ ఆర్‌సీ 17 ద్వారా ఈ కాంబో అభిమానుల ముందుకు రావ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. పుష్ప‌, పుష్ప 2 సినిమాల‌తో త‌న‌ను పాన్ ఇండియ‌న్ హీరోయిన్‌ను చేసిన సుకుమార్‌పై అభిమానంతో ర‌ష్మిక ఈ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల‌ని ఫిక్సైన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న మైసాతో పాటు ర‌ణ‌బాలి సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. దాంతో ఆర్‌సీ 17కు బ‌ల్క్ డేట్స్ కేటాయించేందుకు నేష‌న‌ల్ క్ర‌ష్ రెడీ అయ్యింద‌ట‌.
ధురంధ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌...
ఆర్‌సీ 17 మూవీకి ధురంధ‌ర్ ఫేమ్ శ‌శ్వాత్ స‌చ్‌దేవ్ మ్యూజిక్ అందించ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో లేదంటే 2028 వేస‌విలో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement