Rashmika Mandanna | సుబ్బులక్ష్మి బయోపిక్‌కు రష్మిక రాంగ్ ఛాయిస్ – ట్రోల్స్‌పై నేషనల్ క్రష్ రియాక్షన్
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్నను ఎంపికచేయడంపై ట్రోల్స్ వస్తున్నాయి. దిగ్గజ సింగర్ పాత్రకు రష్మిక రాంగ్ ఛాయిస్ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ ట్రోల్స్‌పై నేషనల్ క్రష్ రియాక్ట్ అయ్యింది. ఈ ట్రోల్స్‌ను పట్టించుకునే టైమ్ తనకు లేదని అన్నది.
Entertainment | Published On Sep 19, 2026, 3.01 pm IST
Rashmika Mandanna | లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో టైటిల్ రోల్ కోసం రష్మిక మందన్న ఎంపికచేయడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తోన్నాయి. దిగ్గజ సింగర్ పాత్రకు రష్మిక ఎంపిక రాంగ్ ఛాయిస్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. ఈ విమర్శలపై నేషనల్ క్రష్ రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను తాను అస్సలు పట్టించుకోనని చెప్పింది.
పట్టించుకోను...
ఓ ఇంటర్వ్యూలో నేషనల్ క్రష్ మాట్లాడుతూ... "సోషల్ మీడియా యుగంలో విమర్శలు సహజం. ఎంత ఉత్తమంగా నటించినా ఏదో ఒక రూపంలో ట్రోల్స్ ఎదురవుతూనే ఉంటాయి. అందుకే వాటిని పట్టించుకోవడం మానేశా. మంచి సినిమాలు, పాత్రలు ఎంచుకోవడంపైనే దృష్టిసారిస్తున్నా. నాపై నమ్మకంతో దర్శకులు అప్పగించిన పాత్రలకు న్యాయం చేయడానికి ఏం చేయాలన్నదే ఆలోచిస్తా. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి కామెంట్‌కు రిప్లై ఇచ్చే టైమ్ నాకు లేదు. వాటి ప్రభావం నా వ్యక్తిగత జీవితం, సినిమాలపై అస్సలు పడనివ్వను. విమర్శించే వారికి నా నటనతోనే సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా" అని రష్మిక మందన్న అన్నది.
రష్మిక మందన్న...
సినిమాల్లో రష్మిక మందన్న డైలాగ్స్ చెబుతోన్న తీరును కొందరు తప్పుబడుతున్నారు. ఆమె డబ్బింగ్‌లో కన్నడ యాస ఎక్కువగా కనిపిస్తుందని కామెంట్లు పెడుతోన్నారు. సుబ్బులక్ష్మి బయోపిక్ కు రష్మిక సొంత డబ్బింగ్ వద్దంటూ చెబుతున్నారు ఈ విమర్శలకు బదులిస్తూ.. "నా మాతృభాష కొడవ. కానీ తెలుగు, తమిళంతో పాటు మిగిలిన భాషలపై నాకు పట్టు ఉంది. ఏ భాషలో సినిమా చేసినా అదే భాషలో ప్రేక్షకులతో నా భావాలకు పంచుకునేందుకు ప్రయత్నిస్తా. ఆ లాంగ్వేజ్‌తో పాటు ఆడియెన్స్‌కు నేను ఇచ్చే గౌరవమది. అంతే కానీ యాస కరెక్ట్‌గా ఉందా? లేదా? అన్నది పట్టించుకోను" అని చెప్పింది.
కన్నడం అనుకున్నా కానీ...
"కెరీర్ ఆరంభంలో కన్నడంలో సినిమాలు చేయడమే గొప్ప అనుకున్నా. కానీ ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళంలో అవకాశాలు వచ్చాయి. ఇన్ని భాషల్లో సినిమాలు చేస్తానని అనుకోలేదు. అది చూడకుండా నా యాసను తప్పుపట్టడం కరెక్ట్ కాదని" రష్మిక పేర్కొన్నది.
సుబ్బులక్ష్మి బయోపిక్ ఇటీవల చెన్నైలో గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ బయోపిక్ ప్రారంభోత్సవ వేడుకకు కమల్‌హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుబ్బులక్ష్మి బయోపిక్‌తో పాటు రణబాలి, మైసా సినిమాలు చేస్తోంది రష్మిక మందన్న.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ranabaali | రణబాలి షూటింగ్ కంప్లీట్ -పెళ్లి ఫొటోతో విరోష్ జోడీ సర్ప్రైజ్
సెప్టెంబర్ 17, 2026

Rashmika Mandanna | కమల్‌హాసన్ క్లాప్‌తో ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం – తమిళంలో రష్మిక స్పీచ్ హైలైట్
సెప్టెంబర్ 17, 2026

Rashmika Mandanna | ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ అనౌన్స్ – నాలుగోసారి విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక?
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Tamil Nadu Government | ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నాం.. నవోదయ పాఠశాలలకు భూములిచ్చేది లేదు.. తేల్చి చెప్పిన తమిళ సర్కార్
- ●MLC L Ramana | 'చేయూత' పెన్షన్ కోసం జియో ట్యాగింగ్ నిబంధనలు సవరించాలి: ఎమ్మెల్సీ ఎల్ రమణ
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ ఫోన్లకు భారీ డిమాండ్.. ధర పెరిగినా తగ్గని క్రేజ్..
- ●Vemula Prashanth Reddy | కేసీఆర్, రేవంత్ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?
- ●Railway TTE Viral Video | రైలులో టికెట్ అడిగిన టీటీఈ.. బట్టలు చింపుకుని యువతి బ్లాక్మెయిల్ డ్రామా: వీడియో తీయడంతో అడ్డంగా బుక్
- ●Mahesh Kumar Goud | ఖైరతాబాద్ అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది : మహేశ్ కుమార్ గౌడ్

Tamil Nadu Government | ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నాం.. నవోదయ పాఠశాలలకు భూములిచ్చేది లేదు.. తేల్చి చెప్పిన తమిళ సర్కార్

MLC L Ramana | 'చేయూత' పెన్షన్ కోసం జియో ట్యాగింగ్ నిబంధనలు సవరించాలి: ఎమ్మెల్సీ ఎల్ రమణ

iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ ఫోన్లకు భారీ డిమాండ్.. ధర పెరిగినా తగ్గని క్రేజ్..

Vemula Prashanth Reddy | కేసీఆర్, రేవంత్ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?



