త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sunitha Lakshma Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే లేక‌పోతే నిధులివ్వ‌డ‌ట‌.. సంగారెడ్డిలో సీఎం చెప్ప‌క‌నే చెప్పిండు

Sunitha Lakshma Reddy | సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేక‌పోతే నిధులివ్వ‌న‌ని సీఎం రేవంత్ చెప్ప‌క‌నే చెప్పిండ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా ల‌క్ష్మారెడ్డి విమ‌ర్శించారు. నిన్న‌ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మాట్లాడిన అబ‌ద్దాల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు.

S

Telangana | Published On Aug 16, 2026, 3.08 pm IST

Sunitha Lakshma Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే లేక‌పోతే నిధులివ్వ‌డ‌ట‌.. సంగారెడ్డిలో సీఎం చెప్ప‌క‌నే చెప్పిండు
Advertisement
  • రేవంత్‌కు ఓ విధాన‌మే లేదు.. రాతి యుగంలో ఉన్న‌ట్టు మాట్లాడుతుండు
  • సన్న బియ్యానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్
  • మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

Sunitha Lakshma Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేక‌పోతే నిధులివ్వ‌న‌ని సీఎం రేవంత్ చెప్ప‌క‌నే చెప్పిండ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా ల‌క్ష్మారెడ్డి విమ‌ర్శించారు. నిన్న‌ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మాట్లాడిన అబ‌ద్దాల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. మీ ఎమ్మెల్యేలే మీ పాల‌న‌ను త‌ప్పుబ‌డుతున్నార‌ని.. ముందు వాళ్ల‌కు స‌మాధానం చెప్పాల‌ని హిత‌వు ప‌లికారు. రేవంత్‌కు ఒక విధాన‌మే లేద‌న్నారు. ఆయ‌న‌ ఎన్ని డైవెర్షన్ రాజకీయాలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.

స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడారు. ప్రజాధనంతో సభలు పెట్టి కేసీఆర్, హరీష్ రావులను సీఎం విమర్శిస్తున్నారు. కేసీఆర్ ఓ అపర భగీరథుడిలా ఇంటింటికి తాగునీళ్లు అందించారు. బూతులు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక్కటీ లేదు. రేషన్ కార్డులపై గొప్పలు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆరు లక్షల 47 వేల రేషన్ కార్డులిచ్చార‌ని ఉత్తమ్ శాసన మండలిలో చెప్పారు. రేషన్ కార్డులపై మీ ఫోటోలు ఎందుకు?

సన్న బియ్యం మీ గొప్ప కాదు.. సన్న బియ్యానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్. సన్న బియ్యం పంపిణీ చేయడం మొదలు పెట్టింది కేసీఆరే. వ్యవసాయ కరెంటు 12 గంటలు కూడా ఇవ్వడం లేదని అధికారులే చెబుతున్నారు.
రైతులను కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పెడుతున్న రేవంత్ రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశామని చెప్పడం హాస్యాస్పదం. రైతు రుణమాఫీని చెప్పినట్టు చేయలేదు. కేసీఆర్ రెండేళ్లలో ఇచ్చిన రైతు బంధు కంటే రేవంత్ రైతు భరోసా నిధులే తక్కువ. బోనస్‌ను బోగస్‌గా మార్చి గొప్పలు చెప్పుకుంటున్నారు.

యూరియా యాప్‌తో రైతుల కష్టాలు పెరిగాయి. యాప్ తెచ్చినందుకు రైతులు సంతోషంగా ఉన్నారా? నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఏవీ? నిరుద్యోగ భృతి ఏదీ? రాజీవ్ యువవికాసం ఏమైంది? హక్కుల గురించి నిరుద్యోగులు అడిగితే నిర్బంధిస్తున్నారు. స్కాలర్ షిప్‌లు, ఫీ రీయింబ‌ర్స్ మెంట్‌పై సీఎం మాట తప్పారు. సిగాచీ పరిశ్రమలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి దాన్ని కూడా నిలుపుకోలేకపోయారు. మాటకు కట్టుబడని సీఎం మాట ఇస్తే తప్పేది లేదని అబద్దాలు చెబుతున్నారు. రోడ్లు పాడయినా రిపేర్లు చేసే పరిస్థితి లేదు.

వ‌చ్చిన మూడు సీట్లు కూడా రావు..

సంగారెడ్డికి సీఎం వచ్చి వ్యక్తిగత విమర్శలు చేసిపోయారు. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. సింగూరును ఎండబెట్టిన ఘనత సీఎం రేవంత్ దే. కల్యాణ లక్మి పథకాన్ని ఎత్తి వేసే కుట్ర చేస్తున్నారు. హరీష్ రావుపై క్షుద్ర పూజల ఆరోణలు చేస్తున్నారు. ఈ నవీన యుగంలో కూడా సీఎం రేవంత్ రాతి యుగంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. క్షుద్ర పూజలు చేసే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారా? సీఎం హోదాలో ఉండి ఆ పిచ్చి మాటలు ఏందీ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడితే మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌కు వచ్చిన మూడు సీట్లు కూడా రావు.

ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకే హరీష్ రావు,కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎంత నీచపు ఆరోపణలు చేసినా ప్రజల మద్దతు బీఆర్ఎస్ కే ఉంది. మహిళలకు ఒక్క చీర ఇచ్చి అదే పనిగా పాల పిట్టల్లా కనిపిస్తున్నారని సీఎం మహిళలను అవమానపరుస్తున్నారు. కాంగ్రెస్ మీటింగ్‌లకు వచ్చెనందుకే ఒకే రంగు చీరలు ఇచ్చినట్టు ఉంది. మిషన్ భగీరథను నిర్వీర్యం చేశారు. చెప్పినవేవి సీఎం అమలు చేయడం లేదు అని సునీతా ల‌క్ష్మారెడ్డి మండిప‌డ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement