Ranveer Singh | బ్యాన్ వేళ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయంలో రణ్‌వీర్ సింగ్ పూజలు – మరో వివాదానికి పుల్‌స్టాప్!
డాన్ 3 సినిమాలో నటించడానికి అంగీకరించి షూటింగ్ మొదలవ్వడానికి ముందు తప్పుకోవడంతో బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌పై సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మూడేళ్లు బ్యాన్ విధించింది. ఈ బ్యాన్ విధించిన తర్వాత రోజే రణ్‌వీర్‌సింగ్ కర్ణాటక వచ్చారు. చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు.
Entertainment | Published On May 26, 2026, 3.14 pm IST
Ranveer Singh | బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌పై సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మూడేళ్లు బ్యాన్ విధించింది. డాన్ 3 సినిమాలో నటించడానికి ఒప్పుకొని షూటింగ్ ప్రారంభం కావడానికి మూడు నెలల ముందు రణ్‌వీర్‌సింగ్ తప్పుకోవడంతో తమకు నలభై ఐదు కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని, వేలాది మంది సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారని దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై రణ్‌వీర్‌సింగ్ సరైన విధంగా స్పందించకపోవడంతో అతడిపై ఫెడరేషన్ మూడేళ్లు నిషేధం విధించింది.
హాట్ టాపిక్‌గా...
రణ్‌వీర్‌సింగ్ బ్యాన్ వార్త బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మూడేళ్లు అతడు సినిమాల్లో నటించడా? దర్శకనిర్మాతలెవరూ అతడితో సినిమాలు చేయరా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కమిటైన సినిమాల పరిస్థితి ఏమిటన్నది డైలమాలో పడింది.
చాముండేశ్వరి టెంపుల్ లో...
కాగా ఈ బ్యాన్ విధించిన తర్వాత రోజు రణ్‌వీర్‌సింగ్ కర్ణాటక వచ్చారు. మైసూరులోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. రణ్‌వీర్‌సింగ్ మైసూరులోని ఈ ఆలయాన్ని సందర్శించడం వెనుక కూడా ఓ వివాదమే ఉంది. ఈ ఏడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కాంతార సినిమాలో రిషబ్ శెట్టి చేసిన పంజుర్లి దేవతారాధన సన్నివేశాలను స్టేజ్‌పై రణ్‌వీర్‌సింగ్ అనుకరించే ప్రయత్నం చేశారు. రణ్‌వీర్‌సింగ్ మిమిక్రీ ఫన్నీగా ఉండటంతో కన్నడ ప్రజలు ఈ బాలీవుడ్ హీరోపై ఫైర్ అయ్యారు. తమ మత విశ్వసాలను దెబ్బతీశాడంటూ అతడిపై కేసు పెట్టారు. ఈ వివాదం ముదరడంతో భేషరతుగా క్షమాపణలు చెప్పడానికి తాను సిద్ధమంటూ రణ్‌వీర్‌సింగ్ ప్రకటించాడు.
వివాదానికి పుల్‌స్టాప్...
క్షమాపణలు చెబితే సరిపోదని, మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకొని తనలోని భక్తి భావాన్ని చాటుకోవాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అనుసరించి రణవీర్‌సింగ్ మంగళవారం చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని కాంతార వివాదానికి పుల్‌స్టాప్ పెట్టారు. ఈ వివాదం సమసిపోయేలోపు మరో వివాదంలో అతడు చిక్కుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ధరుంధర్, ధురంధర్ 2 సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు రణ్‌వీర్ సింగ్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లను రాబట్టాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ranveer Singh | డాన్-3 మూవీ వివాదం.. మౌనం వీడిన రణ్‌వీర్ సింగ్..!
మే 26, 2026

Ranveer Singh Banned | రణ్‌వీర్ సింగ్‌కు భారీ షాక్.. ‘డాన్ 3’ వివాదంతో బ్యాన్ విధించిన సినీ వర్కర్స్ అసోసియేషన్!
మే 25, 2026

Kangana Ranaut | మెడలో తాళితో కంగనా రనౌత్ – సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? – నెటిజన్ల కామెంట్లు వైరల్
మే 22, 2026
తాజావార్తలు
- ●Kayadu Lohar | కోలీవుడ్ డైరెక్టర్ బయోపిక్‌లో టాలీవుడ్ హీరోయిన్లు - బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్
- ●Marco Rubio Taj Mahal | తాజ్ మహల్ దగ్గర మార్కో రూబియో ఫోటోషూట్.. చరిత్ర తెలిస్తే ఇలా చేయరంటూ ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
- ●Harish Rao | సింగరేణికి రేవంత్ సర్కార్ బకాయి రూ. 50 వేల కోట్లపైనే : హరీశ్‌రావు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన సూచీలు..
- ●IT Returns | ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా.. అయితే ఈ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాల్సిందే..
- ●Annamalai | నేరగాళ్లకు స్వేచ్ఛ లభించింది.. సెలబ్రేషన్ మూడ్ నుంచి బయటకు రండి.. విజయ్‌పై అన్నామలై ధ్వజం

Kayadu Lohar | కోలీవుడ్ డైరెక్టర్ బయోపిక్‌లో టాలీవుడ్ హీరోయిన్లు - బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్

Marco Rubio Taj Mahal | తాజ్ మహల్ దగ్గర మార్కో రూబియో ఫోటోషూట్.. చరిత్ర తెలిస్తే ఇలా చేయరంటూ ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

Harish Rao | సింగరేణికి రేవంత్ సర్కార్ బకాయి రూ. 50 వేల కోట్లపైనే : హరీశ్‌రావు

Stock Markets | స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన సూచీలు..



