Dhurandhar OTT |ధురంధర్ మూవీ బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. థియేటర్లలో రిలీజై దాదాపు యాభై రోజులు అవుతోన్న ఇప్పటికీ భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. రణవీర్‌సింగ్ హీరోగా నటించిన ఈ ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 1325 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా చరిత్రను సృష్టించింది. కేవలం మూడు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ బాలీవుడ్ మూవీ నిర్మాతలకు మూడింతల లాభాలు తెచ్చిపెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో... తాజాగా ధురంధర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయినట్లు సమాచారం. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బాలీవుడ్ రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో కేవలం హిందీలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ వీక్‌లో ధురంధర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలిసింది. సారా అర్జున్ హీరోయిన్... స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు. ఈ బాలీవుడ్ మూవీలో రణవీర్‌సింగ్‌కు జోడీగా సారా అర్జున్ నటించింది. ఈ సినిమాతోనే హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్ ఖన్నా విలన్‌గా నటించిన ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్, ఆర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో కనిపించారు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడి తర్వాత భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్ ధురంధర్ పేరుతో ఈ సీక్రెట్ మిషన్‌ను ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా పంజాబ్‌కు చెందిన హమ్జాను (రణవీర్ సింగ్) స్పైగా పాకిస్థాన్‌కు పంపిస్తుంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద ముఠాలకు నాయకుడైన రహమాన్ బలోచ్(అక్షయ్ ఖన్నా) గ్యాంగ్‌లో హమ్జా చేరుతాడు. శత్రు దేశంలో అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? రహమాన్‌ను హమ్జా చంపేశాడా? అతడు ఇండియన్ గూఢచారి అన్నది పాకిస్థాన్ వాళ్లకు తెలిసిందా? హమ్జాకు యాలీనా జమాలీ కి ఉన్న సంబంధం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.ధురంధర్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. ధురంధర్ 2 పేరుతో రూపొందుతోన్న ఈ సీక్వెల్ మార్చి 19న థియేటర్లలోకి రాబోతుంది.