త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Venkat Reddy | కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేసేందుకే వ‌డ్డీ లేని రుణాలు : మంత్రి కోమ‌టిరెడ్డి

Komatireddy Venkat Reddy | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 

S

Telangana | Published On Jan 20, 2026, 7.48 pm IST

Komatireddy Venkat Reddy | కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేసేందుకే వ‌డ్డీ లేని రుణాలు : మంత్రి కోమ‌టిరెడ్డి
Advertisement

Komatireddy Venkat Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా... యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహా ఫంక్షన్ హల్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో స్వ‌యం స‌హాయ‌క సంఘాల స‌భ్యుల‌కు రూ.98,23,458 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య , జిల్లా కలెక్టర్ హనుమంత రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశ పెట్టిందని రాష్ట్రంలో 265 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణం చేసినట్లు అందుకు గాను ప్రభుత్వం 10 వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ధనిక కుటుంబ సభ్యులు ఏ బియ్యం అయితే తింటున్నారో అవే సన్న బియ్యం ప్రతి పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలనే లక్ష్యంతో మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామని అన్నారు.

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో అర్హులైన 16,152 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో మహిళలు ఆర్థికంగా, బలోపేతం చేయడం కోసం పెట్రోల్ బంకులు కూడా మహిళల పేరున ఇస్తున్నామన్నారు. ప్రతి పేద వారు సొంత ఇంట్లో ఉండాలనే గొప్ప లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. యాదగిరిగుట్టతో పాటు యాదగిరిగుట్ట టౌన్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అందుకోసం 100 కోట్లతో యాదగిరిగుట్టలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో చేపట్టడం జరుగుతుందన్నారు. కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. యాదగిరిగుట్టలో 210 కోట్ల వ్యయ తో చేపట్టిన పైప్ లైన్ పనులు త్వరలో పూర్తి కావొస్తున్నందున ప్రతి ఇంటికి గోదారి జలాలు అందుతాయన్నారు. గంధమల్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్ పూర్తి అయితే పరిసర ప్రాంతాలకు , రైతులకు లక్షఎకరాలకు సాగు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement