OTT | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన వెంకటేష్, అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మూవీ
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం మరో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటికే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. .
Entertainment | Published On Jan 20, 2026, 7.28 pm IST
OTT | విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం పెద్ద విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ మూడు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. గత ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
మరో ఓటీటీలో...
ఈ టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ప్రస్తుతం జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మరో ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది అమెజాన్ ప్రైమ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సాయికుమార్, నరేష్, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటించారు.
రామ్‌చరణ్, బాలకృష్ణ సినిమాలకు పోటీగా...
రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్‌కు పోటీగా రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం థియేటర్లలో నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. 2026 సంక్రాంతికి రిలీజైన చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారులో వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఈ సినిమా కూడా కలెక్షన్స్‌తో కుమ్మేస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం కథ ఇదే...
అమెరికాలో టాప్ బిజినెస్‌మెన్ అయిన సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్) తెలంగాణకు వస్తాడు. అతడిని పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాపర్ల నుంచి సత్యను విడిపించే బాధ్యతను ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ వీడీ రాజు (వెంకటేష్)కు అప్పగిస్తాడు సీఏం. ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో వీడి రాజుతో పాటు భార్య భాగ్యం (ఐశ్వర్య రాజేష్) మాజీ ప్రియురాలు మీనాక్షి (మీనాక్షి చౌదరి) ఎలా భాగమయ్యారు? సత్యను పాండే గ్యాంగ్ నుంచి వీడీ రాజు ఎలా కాపాడాడు అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






