Stray Dogs Row | ఆ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే..! మేనకా గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం..!
Stray Dogs Row | వీధికుక్కల అంశంలో మాజీ కేంద్రమంత్రి మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సర్వోన్నత న్యాయస్థానంపై ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, అది న్యాయవ్యవస్థను ధిర్కించడమే అవుతుందంటూ హెచ్చరించింది.
Stray Dogs Row | వీధికుక్కల అంశంలో మాజీ కేంద్రమంత్రి మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సర్వోన్నత న్యాయస్థానంపై ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, అది న్యాయవ్యవస్థను ధిర్కించడమే అవుతుందంటూ హెచ్చరించింది. మాజీ కేంద్రమంత్రి ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వీధికుక్కల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాట్లాడారు. తాజాగా ఈ అంశంపై విచారణ సందర్భంగా ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది.
మేనకా తరఫు న్యాయవాది రాజు రామచంద్రన్‌ని కోర్టు ప్రశ్నిస్తూ కొద్దిరోజుల కిందట కోర్టులు ఉదాసీనంగా వ్యవహరించాలన్నారని.. మీ క్లయింట్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో గమనించారా? మీ క్లయింట్ చేసింది తప్పని.. అయినా ఆమెపై తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని. ఇది గొప్ప విషయం కాదా? అని ప్రశ్నించారు. ఆమె మాట్లాడిన మాటలు మీరు చూశారా? ఆమె బాడీలాంగ్వేజ్ ఏంటి? అంటూ ఘాటుగా స్పందించింది. మీరు కోర్టులు ఉదాసీనంగా ఉండాలంటున్నారని.. మీ క్లయింట్ మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారంటూ మండిపడింది.
మీ క్లయింట్ ప్రస్తుతం జంతువుల హక్కుల కార్యకర్తగా ఉన్నారని.. గతంలో కేంద్రమంత్రిగా పని చేశారని గుర్తు చేసిన కోర్టు.. జంతువుల రక్షణ కోసం ఇప్పటి వరకు ఆమె చేసిన పని ఏంటీ? ఏమైనా బడ్జెట్ కేటాయించారా? బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించేలా ఒప్పించారా? మూగ జీవాల కోసం కొత్త పథకాలు వచ్చేలా చేశారా? అంటూ నిలదీసింది. ఆలోచించకుండా అందరిపై వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని కోర్టు పేర్కొంది. దీనికి న్యాయవాది రాజు రామచంద్రన్ బదులిస్తూ.. తాను గతంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్ తరఫున వాదించానని.. బడ్జెట్ అనేది విధానపరమైన అంశమని చెప్పారు. దీనికి జస్టిస్ విక్రమ్‌నాథ్ తనదైనశైలిలో స్పందించారు. అజ్మల్ కసబ్ ఉగ్రవాదే కావొచ్చని.. కానీ కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని.. మీ క్లయింట్ మాత్రం కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ కౌంటర్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు నిగ్రహంగా ఉండాలని కోర్టు సూచించింది.
గతంలో కుక్కకాట్లకు ఆహారం వేసిన వారే బాధ్యులంటూ చేసిన వ్యాఖ్యలు సరదా కోసం చేసినవి కావని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. మున్సిపల్ కార్పొరేషన్లు చెత్తను సేకరించడంలో విఫలమవడం వల్ల వీధికుక్కలు పెరుగుతున్నాయని విచారణ సందర్భంగా న్యాయవాదులు పేర్కొన్నారు. వీధి కుక్కల సమస్య కేవలం భావోద్వేగ సమస్య మాత్రమే కాదని.. పరిపాలనా బాధ్యతకు సంబంధించిన ప్రశ్న అని కోర్టు పేర్కొంది. స్టెరిలైజేషన్, వ్యర్థాల నిర్వహణ తదితర ప్రాథమిక బాధ్యతలు అధికారులపై ఉంటాయని చెప్పింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






