Bollywood OTT | ఓటీటీలోకి కృతి సనన్ రొమాంటిక్ మూవీ – ప్రియురాలి కోసం సివిల్స్ రాసి…
ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మే ఓటీటీలోకి రాబోతుంది. జనవరి 23న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ రొమాంటిక్ మూవీకి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Jan 19, 2026, 6.11 pm IST
Bollywood OTT | ధనుష్, కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మే కమర్షియల్ హిట్‌గా నిలిచింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. జనవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది.
160 కోట్ల కలెక్షన్స్...
ఎనభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన తేరే ఇష్క్ మే 160 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
ధనుష్, కృతి సనన్ యాక్టింగ్, కెమిస్ట్రీ బాగుందనే కామెంట్స్ వచ్చిన స్టోరీలో కొత్తదనం లేదని, లాజిక్స్ మిస్సయ్యాయనే విమర్శలు వినిపించాయి. ఈ బాలీవుడ్ మూవీ తెలుగులో అమరకావ్యం పేరుతో రిలీజైంది.
కోర్టు కోసు...
2013లో ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో వచ్చిన బాలీవుడ్ మూవీ రాన్‌జానాకు సీక్వెల్‌గా తేరే ఇష్క్ మే సినిమాను రూపొందించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ ప్రకటనే వారిని చిక్కుల్లో పడేసింది. తమ అనుమతి లేకుండా రాన్‌జానాకు సీక్వెల్‌ను తెరకెక్కించడమే కాకుండా అందులోని పాత్రలను, కథానేపథ్యాన్ని వాడుకున్నారంటూ ఆనంద్ ఎల్ రాయ్‌పై ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ముంబాయి హైకోర్టును ఆశ్రయించింది. తమకు 84 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ ఈ పిటీషన్‌లో పేర్కొన్నది.
శంకర్ ప్రేమాయణం....
శంకర్ గురుక్కల్ (ధనుష్) ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్. కోపం ఎక్కువ. అదే యూనివర్సిటీకి ముక్తి బేనివాల్ (కృతి సనన్) పీహెచ్‌డీ చేయడానికి వస్తుంది. కోపంతో జీవించేవారిని మామూలు మనుషులుగా ఎలా మార్చవచ్చో అనే రీసెర్చ్ చేయడానికి శంకర్‌ను ప్రేమిస్తున్నట్లుగా నాటకం ఆడుతుంది. శంకర్ మాత్రం ముక్తిని నిజంగానే ఇష్టపడతాడు. సివిల్స్ సాధిస్తానని ముక్తితో ఛాలెంజ్ చేసిన శంకర్ పైలెట్‌గా ఎందుకు మారాడు? ముక్తితో అతడి పెళ్లి జరిగిందా? లఏదా? అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



