త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | విజ‌య్‌తో పెళ్లి వార్త‌ల‌పై రూమ‌ర్స్‌.. ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పిన ర‌ష్మిక‌..!

Rashmika Mandanna | క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. త‌క్కువ కాలంలో టాప్ హీరోయిన్ వ‌ర‌కు ఎదిగింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న‌ది.

P

Entertainment | Published On Jan 19, 2026, 9.08 pm IST

Rashmika Mandanna | విజ‌య్‌తో పెళ్లి వార్త‌ల‌పై రూమ‌ర్స్‌.. ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పిన ర‌ష్మిక‌..!
Advertisement

Rashmika Mandanna | క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. త‌క్కువ కాలంలో టాప్ హీరోయిన్ వ‌ర‌కు ఎదిగింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న‌ది. గ‌తేడాది వ‌చ్చిన ది గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీతో హిట్‌ను సొంతం చేసుకుంది. సుకుమార్‌-బ‌న్నీ కాంబోలో వ‌చ్చిన పుష్ప‌-2 జ‌పాన్‌లో ఇటీవ‌ల రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. తాజాగా ర‌ష్మిక ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. త‌న‌పై వ‌స్తున్న పుకార్ల‌పై మాట్లాడింది. టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంద‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రిలో ఇద్ద‌రు పెళ్లి చేసుకోనున్న‌ట్లు రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌పై స్పందించాల‌ని కోర‌గా.. మ‌ళ్లీ తెలివిగా ర‌ష్మిక స‌మాధానం చెప్పింది. ఎక్క‌డ విజ‌య్‌ని పెళ్లి చేసుకుంటున్న‌ట్లుగా కానీ.. ఆ వార్త‌ల్లో నిజం ఉంద‌ని కానీ చెప్ప‌లేదు.

నాలుగేళ్లుగా ఇలాంటి వార్త‌లు వింటున్నాన‌ని.. జ‌నం సైతం ఎప్ప‌టి నుంచో ఇదే ప్ర‌శ్న అడుగుతున్నార‌ని.. తాను సైతం దాని కోస‌మే ఎదురుచూస్తున్న‌ట్లుగా న‌వ్వేసింది. దీనిపై ఎప్పుడు స్పందించాలో.. అప్పుడే స్పందిస్తాన‌ని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం చెబుతానంటూ చెప్పుకొచ్చింది. కెమెరాల ముందు విష‌యాలు మాట్లాడ‌లేన‌ని.. ఆఫ్ ద రికార్డ్‌లో అయితే మాత్రం మాట్లాడుతానంటూ పెళ్లి వార్త‌ల‌పై దాట వేసింది. ఇదిలా ఉండ‌గా.. వ‌చ్చే నెల 26న ర‌ష్మిక‌, విజ‌య్ పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. రాజ‌స్థాన్ ఉద‌య్‌పూర్‌లో పెళ్లి వేడుక జ‌రుగుతుంద‌ని టాలీవుడ్‌లో ఈ వార్త చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఇదిలా ఉండ‌గా.. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో ఈ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు మాత్రం ఇద్ద‌రు పెళ్లిపై స్పందించ‌లేదు. అయితే, ఇద్ద‌రు చేతికి రింగ్స్‌తో క‌నిపించారు. దాంతో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది.

Advertisement

తాజావార్తలు

Advertisement