Bhatti Vikramarka | ఫాసిస్టులు, క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేద్దాం: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | మతం అనే సెంటిమెంటు పేరుతో ప్రస్తుతం దేశంలో ఆర్థిక, సామాజిక అంశాలను తప్పుదోవ పట్టించి కార్పొరేట్ , ఫాసిస్టు శక్తులు పార్లమెంటరీ డెమోక్రసీకి ఛాలెంజ్ విసురుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఫాసిస్టులు, క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు.
కార్పొరేట్ శక్తులు పార్లమెంటరీ డెమోక్రసీకి సవాల్ విసురుతున్నాయి
తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇచ్చింది
ఖమ్మంలో సీపీఐ జాతీయ సదస్సులో ఉపముఖ్యమంత్రి ప్రసంగం
Bhatti Vikramarka | మతం అనే సెంటిమెంటు పేరుతో ప్రస్తుతం దేశంలో ఆర్థిక, సామాజిక అంశాలను తప్పుదోవ పట్టించి కార్పొరేట్ , ఫాసిస్టు శక్తులు పార్లమెంటరీ డెమోక్రసీకి ఛాలెంజ్ విసురుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఫాసిస్టులు, క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. సీపీఐ (CPI) శత వసంతాల సందర్భంగా ఖమ్మం (Khammam) జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చాలెంజ్ విసురుతున్న కార్పొరేట్ శక్తులను, దేశంలో ఆర్థిక సామాజిక అంశాలను తప్పుదోవ పట్టిస్తున్న ఆ శక్తులను ఐక్య పోరాటాల ద్వారా అడ్డుకట్ట వేద్దామని, కలసి ముందుకు పోదామని వామపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. దోపిడీ వర్గాలు, దోపిడీకి గురయ్యే వర్గాల మధ్య కాకుండా దేశంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వామపక్షాలు ముందుకు కదలాలి అన్నారు.
వర్గ పోరాటం ద్వారానే సోషలిజం సాధ్యమని కార్ల్ మార్క్స్ చెప్పాడని కానీ భారతదేశం మార్క్స్ అంచనాలకు మినహాయింపుగా మిగిలిందని, భారతదేశ సమాజం వర్గాలపై కాకుండా కులాలపై నిర్మితమైందని జర్మన్ ఫిలాసఫర్ మార్క్స్ వెబర్ స్పష్టంగా చెప్పాడని వివరించారు. వర్గ పోరు అనేది లేకుండా చేసి పార్లమెంటు వ్యవస్థ ప్రశ్నార్ధకమైన నేపథ్యంలో కమ్యూనిస్టుల పాత్ర ఈ దేశంలో చాలా ప్రముఖమైనదని అన్నారు. 100 సంవత్సరాల సీపీఐ చరిత్రలో ఎన్నో త్యాగాలు, ఆటుపోట్లు ఉన్నాయని, ఈ దేశానికి స్వాతంత్రం సాధించడంలో సీపీఐది ప్రముఖస్థానమని చెప్పారు. భారతదేశం అంతటికీ 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి ఒక సంవత్సరం తర్వాత స్వాతంత్రం సిద్ధించిందని, నిరంకుశ నిజాం రాజును వ్యతిరేకించి కమ్యూనిస్టులు చేసిన సాయుధ పోరాటం ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. భూమికోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం.. దున్నేవానిదే భూమి, గ్రంథాలయ ఉద్యమం వంటి గొప్ప పోరాటాలతో తెలంగాణ విలసిల్లిందని చెప్పారు. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో ఏ ఇంటి తలుపు తట్టిన ఒక పోరాట గాధ వినిపిస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలకులు బూర్గుల రామకృష్ణారావు 1950లో కౌలు గారి చట్టాన్ని తీసుకువచ్చారని, ఆ తర్వాత అందులో 1970లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం, పేదల అభివృద్ధికి 20 సూత్రాల పథకం, బ్యాంకుల జాతీయీకరణ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం వంటి గొప్ప చట్టాలను వామపక్ష పార్టీల సహాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశంలో రాష్ట్రంలో తీసుకురాగలిగాయి అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, లేదంటే సగటు మనిషికి హక్కులు దక్కకుండా పోతాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు హక్కును నాశనం చేస్తుందని, రాజ్యాంగంలో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి ఈ దేశంలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



