Ramayana | హాలీవుడ్ సెలిబ్రిటీల కోసం రామాయణ స్పెషల్ షో – రిలీజ్‌కు పది రోజుల ముందే స్క్రీనింగ్
రిలీజ్‌కు పది రోజుల ముందే రామాయణ స్పెషల్ షోను వేయబోతున్నారు మేకర్స్. అయితే ఇండియాలో కాదు. హాలీవుడ్ సెలిబ్రిటీల కోసం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అక్టోబర్ 27న అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఈ వరల్డ్ ప్రీమియర్‌ను స్క్రీనింగ్ చేయబోతున్నారు.
Entertainment | Published On Oct 18, 2026, 5.52 pm IST
రణబీర్ కపూర్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న బాలీవుడ్ మైథాలజీ మూవీ రామాయణ దీపావళి కానుకగా నవంబర్ 5న థియేటర్లలోకి రాబోతుంది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ నటుడు యశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
పది రోజుల ముందే...
రిలీజ్‌కు పది రోజుల ముందే రామాయణ స్పెషల్ షో వేయబోతున్నారు. అయితే ఇండియాలో కాదు. హాలీవుడ్ సెలిబ్రిటీల కోసం అక్టోబర్ 27న లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్లో వరల్డ్ ప్రీమియర్‌ను స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఈ వరల్డ్ ప్రీమియర్‌కు హాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరుకాబోతున్నాయి.
ఆస్కార్‌తో పాటు...
అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఆస్కార్‌తో పాటు ఎన్నో హాలీవుడ్ , అంతర్జాతీయ సినిమాలకు సంబంధించిన వేడుకలు, స్క్రీనింగ్‌లను జరుపుతుంటారు. అమెరికాలోనే అతిపెద్ద సినిమా మ్యూజియంగా ప్రసిద్దిచెందింది. ఈ వేదికపై ఇప్పుడు ‘రామాయణ’ ప్రీమియర్ స్క్రీనింగ్ చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. భారతీయ ఇతిహాసాల గొప్పతనాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసే దిశగా ఇది కీలక ముందడుగు అవుతుందని మేకర్స్ చెబుతోన్నారు.
త్రీడీలో...
వరల్డ్ ప్రీమియర్‌లో త్రీడీలో రామాయణ సినిమాను ప్రదర్శించనున్నారు. మొత్తం 945 మంది ప్రేక్షకులకు మాత్రమే స్క్రీనింగ్‌కు అటెండ్ కాబోతున్నారు. అదికూడా ఆహ్వానం ఉన్నవారినే అనుమతించబోతున్నారు. . స్క్రీనింగ్‌కు ముందు రెడ్ కార్పెట్ సెలబ్రేషన్స్ ఉండబోతున్నట్లు వెల్లడించారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో సెలిబ్రిటీలు రెడ్‌కార్పెట్‌పై సందడి చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. రణబీర్‌కపూర్, యశ్‌తో పాటు రామాయణ టీమ్ మెంబర్స్ కూడా లాస్ ఏజెంల్స్ ప్రీమియర్‌కు అటెండ్ కానున్నట్లు సమాచారం.
నిర్మాతగా యశ్...
రామాయణంలో రాముడిగా రణబీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి కనిపించబోతున్నారు. యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. సన్నీడియోల్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రామాయణ మూవీకి నమిత్ మల్హోత్రాతో పాటు హీరో యశ్ ఓ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. . ఈ చిత్రానికి హాన్స్ జిమ్మర్తో కలిసి ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించారు.
రెండు భాగాలుగా...
రెండు భాగాలుగా ‘రామాయణ’ రూపొందుతోంది. తొలి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ఐమాక్స్ వెర్షన్లో రిలీజ్ రిలీజ్ అవుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bollywood | టీవీ షో వివాదం – బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్
అక్టోబర్ 18, 2026

Vijay – Rashmika | పెళ్లి చేసుకుందామని వంద సార్లు అడిగింది – కాఫీ విత్ కరణ్ షోలో రష్మికపై విజయ్ కామెంట్స్
అక్టోబర్ 18, 2026

Prabhas | ఎట్టకేలకు ప్రభాస్ కల్కి 2 షూటింగ్ షురూ – సాయిపల్లవి కోసం వెయిటింగ్?
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●BRS Denmark | వెలుగు పత్రిక తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●Sridevi | శ్రీదేవి కోసం చూడాల్సిన సినిమా - "హైకూ"పై కోన వెంకట్ కామెంట్స్
- ●Pakistan Airspace Ban India | భారత్‌పై పాకిస్తాన్ మరోసారి అక్కసు: భారత విమానాలపై గగనతల నిషేధం పొడిగింపు
- ●Gurrala Nagaraju | ఆధారాలుంటే బయటపెట్టండి… కేసీఆర్‌పై బురదజల్లడం ఆపండి!
- ●Navaratri Brahmotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో పద్మావతి అమ్మవారు ఎందుకు కనిపించరు?
- ●Meta AI | ఆ వివాదంలో మెటా యూటర్న్.. వెబ్సైట్ల కంటెంట్‌పై కీలక వివరణ!

BRS Denmark | వెలుగు పత్రిక తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

Sridevi | శ్రీదేవి కోసం చూడాల్సిన సినిమా - "హైకూ"పై కోన వెంకట్ కామెంట్స్

Pakistan Airspace Ban India | భారత్‌పై పాకిస్తాన్ మరోసారి అక్కసు: భారత విమానాలపై గగనతల నిషేధం పొడిగింపు

Gurrala Nagaraju | ఆధారాలుంటే బయటపెట్టండి… కేసీఆర్‌పై బురదజల్లడం ఆపండి!



