Gurrala Nagaraju | ఆధారాలుంటే బయటపెట్టండి… కేసీఆర్‌పై బురదజల్లడం ఆపండి!
Gurrala Nagaraju | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై వెలుగు పత్రిక ప్రచురించిన ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ కథనాన్ని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ నాయకులు గుర్రాల నాగరాజు తీవ్రంగా ఖండించారు.
International | Published On Oct 18, 2026, 5.08 pm IST
Gurrala Nagaraju | త్రినేత్ర న్యూస్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై వెలుగు పత్రిక ప్రచురించిన ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ కథనాన్ని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ నాయకులు గుర్రాల నాగరాజు తీవ్రంగా ఖండించారు.
“ఏం రాసినా చెల్లుతది.. ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఆరోపణలు చేసేటప్పుడు వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను ప్రజల ముందుంచాలి. సంచలన శీర్షికలు పెట్టి ప్రజల్లో అపోహలు కలిగించడం ఎంతవరకు సమంజసం? అని ఆయన ప్రశ్నించారు.
“ప్రశ్నించే హక్కు పత్రికలకు ఉంది. అదే సమయంలో వాస్తవాలను నిర్ధారించుకొని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. కేసీఆర్ గారిని విమర్శించాలనుకుంటే వాస్తవాలతో విమర్శించండి. ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేసి, వాటినే నిజాలుగా ప్రచారం చేస్తే మేం మౌనంగా ఉండం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ప్రశ్నిస్తం” అని స్పష్టం చేశారు.
ఈ కథనానికి సంబంధించిన ఆధారాలను వెలుగు యాజమాన్యం బహిర్గతం చేయాలని నాగరాజు డిమాండ్ చేశారు. ఆరోపణలను నిరూపించలేకపోతే కథనాన్ని ఉపసంహరించుకొని, మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో బేషరతుగా క్షమాపణ ప్రచురించాలని కోరారు. డిజిటల్ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ అదే వివరణ ఇవ్వాలన్నారు. “పత్రికా స్వేచ్ఛకు మేం గౌరవమిస్తం. ఆ స్వేచ్ఛతోపాటు బాధ్యత కూడా ఉండాలంటున్నం. తెలంగాణ ప్రజలకు కావాల్సింది నిజాలు—అపోహలు కాదు. ఎవరి ఆరోపణల్లో ఎంత నిజముందో ప్రజల ముందే తేలాలి!” అని గుర్రాల నాగరాజు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Brother and Sister Die in Road Accident | దసరాకు చెల్లిని పుట్టింటికి తీసుకొస్తుండగా ప్రమాదం.. అన్నాచెల్లెళ్లు స్పాట్ డెడ్
అక్టోబర్ 18, 2026

Bathukamma | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
అక్టోబర్ 18, 2026

Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Navaratri Brahmotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో పద్మావతి అమ్మవారు ఎందుకు కనిపించరు?
- ●Meta AI | ఆ వివాదంలో మెటా యూటర్న్.. వెబ్సైట్ల కంటెంట్‌పై కీలక వివరణ!
- ●Brother and Sister Die in Road Accident | దసరాకు చెల్లిని పుట్టింటికి తీసుకొస్తుండగా ప్రమాదం.. అన్నాచెల్లెళ్లు స్పాట్ డెడ్
- ●London Parliament Square Protest | లండన్‌లో హైడ్రామా: సీఈసీకి వ్యతిరేకంగా ధ్రువ్ రాఠీ స్పీచ్.. పోటీగా 'మోదీ.. మోదీ' నినాదాలు!
- ●Bathukamma | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ●Bollywood | టీవీ షో వివాదం - బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్

Navaratri Brahmotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో పద్మావతి అమ్మవారు ఎందుకు కనిపించరు?

Meta AI | ఆ వివాదంలో మెటా యూటర్న్.. వెబ్సైట్ల కంటెంట్‌పై కీలక వివరణ!

Brother and Sister Die in Road Accident | దసరాకు చెల్లిని పుట్టింటికి తీసుకొస్తుండగా ప్రమాదం.. అన్నాచెల్లెళ్లు స్పాట్ డెడ్

London Parliament Square Protest | లండన్‌లో హైడ్రామా: సీఈసీకి వ్యతిరేకంగా ధ్రువ్ రాఠీ స్పీచ్.. పోటీగా 'మోదీ.. మోదీ' నినాదాలు!



