త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Denmark | వెలుగు పత్రిక తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

BRS Denmark | బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) ప్రతిష్ఠను దెబ్బతీసేలా వెలుగు ప‌త్రిక (Velugu News Paper) ప్ర‌చురించిన త‌ప్పుడు క‌థ‌నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని బీఆర్‌ఎస్‌ డెన్మార్క్‌ అధ్యక్షుడు శ్యామ్‌ బాబు ఆకుల అన్నారు.

S

Telangana | Published On Oct 18, 2026, 5.29 pm IST

BRS Denmark | వెలుగు పత్రిక తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
Advertisement
  • ప‌త్రికా స్వేచ్ఛ పేరుతో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలు సరికాదు
  • వెలుగు పత్రిక బేషరతుగా క్షమాపణ చెప్పాలి
  • బీఆర్‌ఎస్‌ డెన్మార్క్‌ అధ్యక్షుడు శ్యామ్‌ బాబు ఆకుల డిమాండ్

BRS Denmark | త్రినేత్ర న్యూస్: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) ప్రతిష్ఠను దెబ్బతీసేలా వెలుగు ప‌త్రిక (Velugu News Paper) ప్ర‌చురించిన త‌ప్పుడు క‌థ‌నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని బీఆర్‌ఎస్‌ డెన్మార్క్‌ అధ్యక్షుడు శ్యామ్‌ బాబు ఆకుల అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అపోహలు సృష్టించడం స‌రికాద‌న్నారు. ‘కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే శీర్షిక‌తో వెలుగు దినపత్రిక త‌ప్పుడు క‌థ‌నాన్ని ప్ర‌చురించింద‌న్నారు. ఈమేర‌కు ఆదివారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

తెలంగాణ సాగునీటి రంగంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతాంగానికి ఎంతో కీలకమైనవి. అలాంటి ప్రాజెక్టులపై వార్తలు ప్రచురించే ముందు సంబంధిత అధికారిక రికార్డులను పరిశీలించి, వాస్తవాలను ధ్రువీకరించాలి. సంబంధిత అధికారుల వివరణ తీసుకోవడం పత్రికల బాధ్యత. తగిన ఆధారాలు లేకుండా సంచలనాత్మక శీర్షికలతో కథనాలు ప్రచురించడం ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించడం బాధ్యతాయుతమైన జర్నలిజం అనిపించుకోదు.

క‌థ‌నాన్ని ఉప‌సంహ‌రించుకోవాలి

రాజకీయ నాయకులను ప్రశ్నించే హక్కును, పత్రికా స్వేచ్ఛను బీఆర్‌ఎస్‌ గౌరవిస్తుంది. ఆ స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు చేయడం, వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడం సమర్థనీయం కాదు. ప్రజలకు వాస్తవాలను చేర‌వేయాల్సిన మీడియా సంస్థలు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కేసీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచురించిన ఈ కథనాన్ని వెలుగు పత్రిక వెంటనే ఉపసంహరించుకోవాలి. కథనంలోని ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను వెల్లడించాలి.

లేదంటే..

కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించడంతో పాటు, డిజిటల్‌ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ ప్రకటించాలి. ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ఇప్పటికే వెలుగు పత్రిక యాజమాన్యానికి, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేసింది. గడువులోగా తగిన స్పందన రావాలి. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలకు సంబంధిత సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది.

తెలంగాణ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి, సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణకు బీఆర్‌ఎస్‌ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు సైతం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తప్పుడు ప్రచారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఖండించాలి అని శ్యామ్‌బాబు విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement