Bollywood | టీవీ షో వివాదం – బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్
బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2010లో రాఖీ సావంత్ హోస్ట్‌గా వ్యవహరించిన టీవీ షోలో పాల్గొన్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాఖీ సావంత్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల కారణంగానే అతడు చనిపోయినట్లు కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విచారణకు బాలీవుడ్ నటి హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Entertainment | Published On Oct 18, 2026, 4.33 pm IST
Bollywood | బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చిక్కుల్లో పడింది. ఓ టీవీ షో వివాదంలో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. పదహారేళ్ల క్రితం జరిగిన ఓ ఆత్మహత్య కేసుకు సంబంధించి రాఖీ సావంత్ చాలా కాలంగా విచారణకు హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీవీ షో...
2010లో రాఖీ సావంత్ హోస్ట్‌గా రాఖీ కా ఇన్సాఫ్ పేరుతో ఓ టీవీ షో టెలికాస్ట్ అయ్యింది. దాంపత్య జీవితంలో ఏర్పడిన విభేదాల పరిష్కారం అనే కాన్సెప్ట్‌తో రూపొందింది. రాఖీ సావంత్ షోకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రేమ్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ అహిర్వాల్ అనే వ్యక్తి హాజరయ్యాడు. భార్య అనిత మొదలైన గొడవలను ఈ షో ద్వారా పరిష్కరించుకోవాలని అనుకున్నారు.ఈ టీవీ షోకు హాజరైన కొద్ది రోజుల తర్వాత లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాఖీ సావంత్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తట్టుకోలేక తన కొడుకు చనిపోయాడంటూ లక్ష్మణ్ తల్లి సావిత్రి కేసు పెట్టింది. నపుంసకుడు అంటూ హేళనగా రాఖీ సావంత్ మాట్లాడిందని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడంతో అవమానం తట్టుకోలేక ఆతహత్య చేసుకున్నాడంటూ ఆరోపించింది.
నాన్ బెయిలబుల్...
ఈ కేసులో టీవీ షో నిర్వహకులతో పాటు రాఖీ సావంత్‌పై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించిన రాఖీ సావంత్ కోర్టుకు రాకపోవడంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. డిసెంబర్ 1న తప్పకుండా కోర్టుకు రావాలని చెప్పారు. స్పెషల్ సాంగ్స్‌తో బాలీవుడ్లో ఫేమస్ అయ్యింది రాఖీ సావంత్. కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. టీవీ షోలలో పాల్గొన్నది. గత కొద్ది రోజులుగా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay – Rashmika | పెళ్లి చేసుకుందామని వంద సార్లు అడిగింది – కాఫీ విత్ కరణ్ షోలో రష్మికపై విజయ్ కామెంట్స్
అక్టోబర్ 18, 2026

Janhvi Kapoor | జాన్వీ కపూర్ సరికొత్త ప్రయాణం..! ఈ రంగంలోనైనా సక్సెస్ అవుతుందా?
అక్టోబర్ 14, 2026

Mrunal Thakur | మృణాల్ కొత్త సినిమాలకు నో చెబుతోందా..? అసలు కారణం అదేనా..?
అక్టోబర్ 14, 2026
తాజావార్తలు
- ●Navaratri Brahmotsavam | సూర్యప్రభ వాహనం విహరించిన మలయప్పస్వామి.. పరవశించిన భక్తజనం
- ●Lok Bhavan | తెలంగాణ లోక్ భవన్లో ఆయుధ పూజ
- ●Navratri Special | ఆయుధ పూజ నుంచి ఆత్మనిగ్రహం వరకు.. దసరా చెప్పే జీవన పాఠాలు!
- ●Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క
- ●Jagadish reddy | కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఉంటే.. ఈరోజు తెలంగాణలో కరువు ఉండేది కాదు
- ●Traffic Jam | ఊర్లకు బారులు తీరిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

Navaratri Brahmotsavam | సూర్యప్రభ వాహనం విహరించిన మలయప్పస్వామి.. పరవశించిన భక్తజనం

Lok Bhavan | తెలంగాణ లోక్ భవన్లో ఆయుధ పూజ

Navratri Special | ఆయుధ పూజ నుంచి ఆత్మనిగ్రహం వరకు.. దసరా చెప్పే జీవన పాఠాలు!

Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క



