త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranabaali Movie | ర‌ణ‌బాలి నుంచి పెళ్లి సాంగ్ వ‌చ్చేసింది – విజ‌య్, ర‌ష్మిక కెమిస్ట్రీ అదుర్స్‌

కొత్త జంట విజ‌య్‌, ర‌ష్మిక‌ల‌కు ర‌ణ‌బాలి టీమ్ ఓ స్పెష‌ల్‌గా విషెస్ చెప్పింది. ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట‌తో పాటుగా విడుద‌ల చేసిన విజ‌య్‌, ర‌ష్మిక పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Feb 28, 2026, 1.12 pm IST

Ranabaali Movie | ర‌ణ‌బాలి నుంచి పెళ్లి సాంగ్ వ‌చ్చేసింది – విజ‌య్,  ర‌ష్మిక కెమిస్ట్రీ అదుర్స్‌
Advertisement

Ranabaali Movie |  టాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ కొత్త జంట‌కు ర‌ణ‌బాలి టీమ్ స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి పెళ్లి సాంగ్ ను రిలీజ్ చేశారు. రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తున్నారు. ఎంద‌య్యా సామీ అంటూ సాగే పెళ్లి సాంగ్‌ను శ‌నివారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. రెట్రో స్టైల్‌లో సాగే విజువ‌ల్స్‌తో ఈ పాట ఆక‌ట్టుకుంటుంది. ఇందులో విజ‌య్‌, ర‌ష్మిక కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది.

యోధుడిగా విజ‌య్‌...

ఈ పాట‌తో పాటు ఓ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో పంచె, కండువాతో అల‌నాటి కాలానికి చెందిన యోధుడిగా విజ‌య్ క‌నిపించ‌గా... చీర‌క‌ట్టులో సంప్ర‌దాయ గృహిణిగా ర‌ష్మిక క‌నిపించింది. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇందులో ర‌ణ‌బాలి అనే పాత్ర‌లో విజ‌య్ క‌నిపించ‌బోతుండ‌గా...జ‌య‌మ్మ‌గా ర‌ష్మిక న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

శ‌ప్త‌భూమి న‌వ‌ల‌..

బ్రిటీష‌ర్ల‌ను ఎదురించి పోరాడిన ఓ యోధుడి క‌థ‌తో ర‌ణ‌బాలి మూవీ రూపొందుతోంది. బండి నారాయ‌ణ‌స్వామి రాసిన శ‌ప్త‌భూమి అనే న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌ణ‌బాలి మూవీ సెప్టెంబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

మూడో సినిమా...

గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత విజ‌య్‌, ర‌ష్మిక కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూడో సినిమా ఇది.ఇప్ప‌టికే కొంత భాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. పెళ్లి కోసం ఈ మూవీ షూటింగ్‌కు విజ‌య్‌, ర‌ష్మిక బ్రేకిచ్చారు. మార్చి సెకండ్ వీక్ నుంచి ర‌ణ‌బాలి చిత్రీక‌ర‌ణ తిరిగి మొద‌లుకానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌ణ‌బాలి మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో మ‌మ్మీ మూవీ ఫేమ్ హాలీవుడ్ న‌టుడు ఆర్నాల్డ్ వోస్లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. టాక్సీవాలా బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత విజ‌య్‌, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూవీ ఇది.

 

Advertisement
Advertisement