త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana | ‘రామాయణ’ ట్రైలర్‌ వచ్చేస్తోంది..!

Ramayana | రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్‌ యాక్షన్‌ డ్రామా నవంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మరో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేక‌ర్స్ ఏర్పాట్లు చేశారు.

P

Entertainment | Published On Oct 14, 2026, 9.40 pm IST

Ramayana | ‘రామాయణ’ ట్రైలర్‌ వచ్చేస్తోంది..!
Advertisement

Ramayana | రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్‌ యాక్షన్‌ డ్రామా నవంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మరో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేక‌ర్స్ ఏర్పాట్లు చేశారు. గురువారం మ‌రో ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన గ్లింప్స్‌ను కూడా విడుదల చేసింది. భారీ బడ్జెట్‌తో నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థ డీఎన్‌ఈజీ (DNEG) వీఎఫ్‌ఎక్స్‌ అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్న సోనీ పిక్చర్స్‌.. అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాజా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్‌, వివేక్‌ ఒబెరాయ్‌, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రవి దూబే, అరుణ్‌ గోవిల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌, టీ-సిరీస్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఏఆర్‌ రెహమాన్‌, హాలీవుడ్‌ సంగీత దర్శకుడు హాన్స్‌ జిమ్మర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘రామాయణ’ ట్రైలర్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

 

Advertisement
Advertisement