Ramayana | విజువల్ వండర్ రామాయణ ట్రైలర్.. మీరూ చూసేయండి
Ramayana | భారతీయ ఇతిహాసాల్లో రామాయణానికి (Ramayanam)అగ్రస్థానం ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా, మరెన్నిసార్లు దృశ్యరూపకంలో చూసినా కొత్తగానే ఉంటుంది. సీతారామ చరిత్రను సినీ దర్శకులు తమ సృజనాత్మకతను జోడించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెబుతూ ఉంటారు.
Entertainment | Published On Jul 30, 2026, 6.47 am IST
Ramayana | త్రినేత్ర.న్యూస్: భారతీయ ఇతిహాసాల్లో రామాయణానికి (Ramayanam)అగ్రస్థానం ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా, మరెన్నిసార్లు దృశ్యరూపకంలో చూసినా కొత్తగానే ఉంటుంది. సీతారామ చరిత్రను సినీ దర్శకులు తమ సృజనాత్మకతను జోడించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెబుతూ ఉంటారు. అలా వచ్చిన ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూనే (కొన్ని మినహా) ఉన్నారు.
తాజాగా దంగల్ ఫేమ్ నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో భారతదేశ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో `రామాయణ` (Ramayana) తెరకెక్కుతున్నది. సుమారు రూ.4000 కోట్లతో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అధినేత నమిత్ మల్హోత్రా (Namit Malhotra) నిర్మాణంలో ఈ పౌరాణిక మహాకావ్యం రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్నది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి (Sai Pallavi) సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా ఈ సినిమాలో నటిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి (నవంబర్ 8, 2026 న), రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయనున్నారు. మొదటి భాగం (Part 1) కి సంబంధించిన ట్రైలర్‌ను (Ramayana Trailer) బ్రహ్మముహూర్తాన (Brahma Muhurt) మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
The Ramayana Trailer.
This is where the EPIC BEGINS. 🏹Namit Malhotra’s Ramayana
Directed by Nitesh TiwariStarring
Ranbir Kapoor as Rama
Yash as Ravana
Sai Pallavi as Sita
Sunny Deol as Hanuman
Music by Hans Zimmer & A.R. Rahman
Globally Distributed by Sony Pictures…— Namit Malhotra (@malhotra_namit) July 29, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే – రజనీకాంత్‌కు పోటీగా!
జులై 26, 2026

Ramayana | సీతగా సాయిపల్లవి ఎలా కనిపిస్తుందో తెలియదు : దీపికా చిఖ్లియా
జులై 25, 2026

Ramayana Trailer | విద్యార్థుల నిరసనల ఎఫెక్ట్ – రామాయణ ట్రైలర్ వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా?
జులై 24, 2026
తాజావార్తలు
- ●Assembly Session | వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు.. ఒక రోజుకే పరిమితం?
- ●Jurala Project | జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 10 గేట్లు ఎత్తివేత
- ●Heavy Rains | ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- ●Horoscope | జూలై 30 రాశిఫలాలు.. ఈ రాశివారికి అనవసర ఖర్చులు ఉంటాయి!
- ●Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్‌మేకర్’..!
- ●RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ

Assembly Session | వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు.. ఒక రోజుకే పరిమితం?

Jurala Project | జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 10 గేట్లు ఎత్తివేత

Heavy Rains | ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Horoscope | జూలై 30 రాశిఫలాలు.. ఈ రాశివారికి అనవసర ఖర్చులు ఉంటాయి!



