Ramayana Trailer | రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పేశారు – సాయిపల్లవికి మరోసారి అన్యాయం?
బాలీవుడ్ మూవీ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. జూలై 24న ఈ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రణభీర్‌కపూర్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. యశ్ విలన్‌గా కనిపించబోతున్నాడు.
Entertainment | Published On Jul 11, 2026, 1.00 pm IST
Ramayana Teaser | ప్రస్తుతం పాన్ ఇండియన్ వైడ్‌గా భారీ బజ్ నెలకొన్న సినిమాల్లో రామాయణ ఒకటి. ఈ బాలీవుడ్ మైథాలజీ మూవీలో రణభీర్‌కపూర్ హీరోగా నటిస్తున్నాడు. రామాయణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాతోనే సాయిపల్లవి హీరోయిన్‌గా హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. కేజీఎఫ్ హీరో యశ్ విలన్‌గా నటిస్తున్నాడు.
సీతారాముడి పాత్రల్లో రణభీర్‌కపూర్, సాయిపల్లవి కనిపించబోతుండగా... యశ్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నారు.
నాలుగు వేల కోట్ల బడ్జెట్...
దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా రామాయణ మూవీ తెరకెక్కుతోంది. తొలి పార్ట్‌ను ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
కాగా రామాయణ టీజర్‌పై మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ రివీల్ చేశారు. ఈ మైథాలజీ మూవీ టీజర్‌ను జూలై 24న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. టీజర్ రిలీజ్‌కు సంబంధించి ముంబైలో మేకర్స్ ఓ భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారట.
రూమర్ వైరల్....
కాగా రామాయణ ట్రైలర్ పై ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాయిపల్లవి క్యారెక్టర్‌ను చూపించకుండానే ట్రైలర్ ను కట్ చేయబోతున్నారని అంటున్నారు. ఈ ట్రైలర్ లో కేవలం రణభీర్‌కపూర్, యశ్ మాత్రమే కనిపించనున్నట్లు సమాచారం. ప్రమోషనల్ స్ట్రాటజీ కోసమే సాయిపల్లవి రోల్‌ను మేకర్స్ దాస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆగస్ట్‌లో ఓ స్పెషల్ వీడియో ద్వారా సాయిపల్లవి లుక్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఎక్‌దిన్‌పై విమర్శలు...
ఎక్ దిన్ మూవీతో సాయిపల్లవి బాలీవుడ్‌లో తొలి అడుగు వేసింది. ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. సాయిపల్లవి క్యారెక్టర్‌పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా ఆమె డబ్బింగ్‌లో తమిళయాస కనిపించిందంటూ కంప్లైంట్స్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో రామాయణలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఎక్‌దిన్ రిజల్ట్‌ను దృష్టిలో పెట్టుకొని సాయిపల్లవి డబ్బింగ్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. హిందీ డబ్బింగ్ మరొకరితో చెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
కాజల్ అగర్వాల్....
రామాయణ మూవీకి నితీష్ తివారీ దర్శకత్వంలో వహించాడు. ఈ సినిమాలో సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●TRAI | 1600, 140 సిరీస్ ఫోన్ నంబర్లపై ట్రాయ్ క్లారిటీ.. అసలు సమస్యపై మాత్రం మౌనం..
- ●Donald Trump | నన్ను హతమారిస్తే.. ఇరాన్ బూడిదవక తప్పదు.. ట్రంప్ హెచ్చరికలు
- ●Kavitha | రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?.. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: కవిత
- ●Lenin Collections | లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్ - అఖిల్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ - పదకొండేళ్ల రికార్డ్ బ్రేక్
- ●India-New Zealand | 2030 నాటికి రూ.35వేల కోట్ల వాణిజ్యం.. న్యూజిలాండ్‌తో కుదిరిన డీల్
- ●ISKCON vs Puri Temple | ఇస్కాన్ వర్సెస్ పూరీ శ్రీమందిరం: విదేశాల్లో జగన్నాథుని రథయాత్ర తేదీలపై ఎందుకీ వివాదం?

TRAI | 1600, 140 సిరీస్ ఫోన్ నంబర్లపై ట్రాయ్ క్లారిటీ.. అసలు సమస్యపై మాత్రం మౌనం..

Donald Trump | నన్ను హతమారిస్తే.. ఇరాన్ బూడిదవక తప్పదు.. ట్రంప్ హెచ్చరికలు

Kavitha | రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?.. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: కవిత

Lenin Collections | లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్ - అఖిల్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ - పదకొండేళ్ల రికార్డ్ బ్రేక్






