త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | “ఓబీసీ కాలమ్” పెట్టాలని అమిత్ షాను అడగాలి

Ponnam Prabhakar | త్వ‌రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నార‌ని.. ఓబీసీ కాల‌మ్ (OBC Colum) పెట్టాల‌ని అడ‌గాల‌ని ఆర్ కృష్ణ‌య్య‌తో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు.

S

Telangana | Published On Oct 29, 2026, 7.04 pm IST

Ponnam Prabhakar | “ఓబీసీ కాలమ్” పెట్టాలని అమిత్ షాను అడగాలి
Advertisement
  • కులాల లెక్కలు ఉంటేనే ఓబీసీ లెక్కలు తెలుస్త‌య్‌
  • ఆర్ కృష్ణ‌య్య‌తో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: త్వ‌రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నార‌ని.. ఓబీసీ కాల‌మ్ (OBC Colum) పెట్టాల‌ని అడ‌గాల‌ని ఆర్ కృష్ణ‌య్య‌తో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. గురువారం స‌చివాలయంలో రాజ్యసభ సభ్యులు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణ‌య్య‌ పొన్నంను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ఇక్కడి అన్ని రాజకీయ పార్టీల బీసీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, బీసీ సంఘాల ప్రతినిధులను కలుపుకొని వెళ్లి ఓబీసీ కాలమ్ ఒక్క‌టే డిమాండ్‌తో అడ‌గాల‌ని కోరారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనతో పాటు కుల గణనను కూడా నిర్వహించాలి. అందులో ఎస్సీ, ఎస్టీలతో పాటు తప్పనిసరిగా 'ఓబీసీ' (OBC) కాలమ్ చేర్చాలి. గతంలో జన గణనలో కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 14న ఇచ్చిన 40 ప్రశ్నల్లో ఎస్సీ, ఎస్టీ అదర్స్ అని ఉంది ఓబీసీ లేదు. కులాల వారీగా లెక్కలు అడగడం లేదు.. కులాల లెక్కలు ఉంటేనే ఓబీసీ లెక్కలు తెలుస్త‌యి.

కోర్టుల్లో రిజర్వేషన్లు 50 శాతం మించి అడుగుతున్నప్పుడల్లా, క‌చ్చితమైన కులాల వారీగా జనాభా లెక్కలు (ఎంపైరికల్ డేటా) అడుగుతున్నారు. ఓబీసీ కాలమ్ ఉంటేనే ఈ లెక్కలు స్పష్టంగా వస్తాయి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి జరుగుతున్న జన గణనలో ఓబీసీ కుల గణన చేయాలని కోరుతున్న.

2011 తర్వాత ఇప్పుడు జనాభా లెక్కలు జరుగుతున్నాయి. కేంద్రం జన గణనలో కుల గణన చేర్చాలని ఇప్పటికే తెలంగాణ శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఓబీసీ కాలమ్ పెట్టడం వల్ల జనాభా లెక్కలు క‌చ్చితంగా తేలుతాయి. దాని ఆధారంగా చట్టసభల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు పెంచడానికి, బడ్జెట్ కేటాయింపులు చేయడానికి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రక్రియ సులభమవుతుంది అని పొన్నం వివ‌రించారు.

Advertisement
Advertisement