Mani Ratnam | అనౌన్స్ చేసిన ఆరు నెలల్లోనే రిలీజ్ – సాయిపల్లవి, మణిరత్నం మూవీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
షూటింగ్ మొదలైన ఆరు నెలల్లోనే మణిరత్నం కొత్త సినిమా థియేటర్లలోకి రాబోతుంది. విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా మణిరత్నం దర్శకత్వంలో ఇంజివెల్లం పేరుతో తమిళంలో ఓ రొమాంటిక్ మూవీ రూపొందుతోంది. ఆగస్ట్‌లో షూటింగ్ మొదలైన ఈ మూవీ జనవరిలో థియేటర్లలోకి రాబోతుంది.
Entertainment | Published On Oct 29, 2026, 6.07 pm IST
Mani Ratnam | పాన్ ఇండియన్ కల్చర్ కారణంగా స్టార్ డైరెక్టర్లు తమ సినిమాల షూటింగ్‌ల కోసమే రెండు, మూడేళ్లు టైమ్ తీసుకుంటున్నారు. కానీ దిగ్గజ దర్శకుడు మణిరత్నం మాత్రం అనౌన్స్ చేసిన ఐదు నెలల్లోనే తన కొత్త సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
ఇంజివెల్లం...
విజయ్ సేతుపతి, సాయిపల్లవి (Sai Pallavi) జంటగా మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో ఇంజివెల్లం పేరుతో ఓ రొమాంటిక్ మూవీ తెరకెక్కుతోంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈసినిమా షూటింగ్ ఆగస్ట్‌లో మొదలైంది. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ మొత్తం పూర్తిచేశారు మణిరత్నం. ఇంజివెల్లం సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఐదు నెలల్లోనే...
కాగా ఇంజివెల్లం రిలీజ్ డేట్ ఖరారైనట్లు సమాచారం. జనవరి 29న ఈ రొమాంటిక్ (Romantic Movie) మూవీ థియేటర్లలోకి రానున్నట్లు చెబుతోన్నారు. మణిరత్నం కెరీర్‌లో తక్కువ రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తిచేసుకున్న సినిమా ఇదే. అనౌన్స్‌చేసిన ఐదు నెలల్లోనే ఇంజివెల్లం థియేటర్లలో విడుదల కానుండటం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
రెమ్యూనరేషన్ తగ్గించుకొని...
ప్రస్తుతం మణిరత్నం కెరీర్ కష్టాల్లో ఉంది. ఈ దిగ్గజ దర్శకుడు హిట్టు అందుకొని పదేళ్లు దాటిపోయింది. ఓ సక్సెస్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలనే లిమిటెడ్ బడ్జెట్‌లో తక్కువ షూటింగ్ డేస్‌తో ప్రయోగాత్మకంగా ఇంజివెల్లం సినిమా చేశారు. మణిరత్నంపై ఉన్న గౌరవం, అభిమానంతో ఈ సినిమా కోసం విజయ్ సేతుపతితో పాటు సాయిపల్లవి తమ రెమ్యూనరేషన్ తగ్గించుకొని నటించినట్లు సమాచారం. ఇంజివెల్లం సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు మణిరత్నం ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నారు.
ఇరవై రోజుల గ్యాప్‌లో...
కాగా ఈ నవంబర్‌లో ఇరవై రోజుల గ్యాప్‌లో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నవంబర్ 5న బాలీవుడ్ మూవీ రామాయణ, నవంబర్ 20న తమిళ మూవీ ఓం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్‌తో సాయిపల్లవి బిజీగా ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Trisha | త్రిష తెలుగు వెబ్‌సిరీస్ - సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్...
- ●KTR | ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ ఎవరి కోసం, దేని కోసం?
- ●Super El Nino | సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55,000 మరణాలు
- ●Hyundai Bayon | హ్యుందాయ్ బయాన్ ఎస్యూవీ వచ్చేసింది.. ధరలు ఎంతంటే?
- ●CEC Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై అవినీతి దర్యాప్తు: కేరళం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రూ.700 కోట్ల రోడ్డు ప్రాజెక్టులో ఏం జరిగింది?
- ●Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు - రంగంలోకి అల్లు అర్జున్ డైరెక్టర్

Trisha | త్రిష తెలుగు వెబ్‌సిరీస్ - సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్...

KTR | ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ ఎవరి కోసం, దేని కోసం?

Super El Nino | సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55,000 మరణాలు

Hyundai Bayon | హ్యుందాయ్ బయాన్ ఎస్యూవీ వచ్చేసింది.. ధరలు ఎంతంటే?






