త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | మృణాల్ కొత్త సినిమాలకు నో చెబుతోందా..? అస‌లు కార‌ణం అదేనా..?

Mrunal Thakur | ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక మందన్న సైతం కీలక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. అయితే చిత్ర బృందం నుంచి దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

P

Entertainment | Published On Oct 14, 2026, 5.59 pm IST

Mrunal Thakur | మృణాల్ కొత్త సినిమాలకు నో చెబుతోందా..? అస‌లు కార‌ణం అదేనా..?
Advertisement

Mrunal Thakur | ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక మందన్న సైతం కీలక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. అయితే చిత్ర బృందం నుంచి దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో మృణాల్‌ కొత్త సినిమాలకు సంతకాలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ మీడియా చిట్‌చాట్‌లో మృణాల్‌ తన కెరీర్‌ గురించి స్పందించింది. గతంలో అంగీకరించిన సినిమాలనే ప్రస్తుతం పూర్తి చేస్తున్నానని, కొత్త కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నానని తెలిపింది. మంచి కథ, తనకు నచ్చిన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. గత తొమ్మిది నెలలుగా కొత్త సినిమాలకు సంతకం చేయలేదని వెల్లడించింది. అయితే ‘రాకా’లో నటిస్తున్న విషయాన్ని మాత్రం బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. అలాగని ఆ వార్తలను ఖండించనూ లేదు. దీంతో ఈ సినిమాలో మృణాల్‌ పాత్రపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రష్మిక పేరు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ, ఆమె పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది.

‘రాకా’పై భారీ ఆశలు

ఇటీవల మృణాల్‌ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ‘డెకాయిట్‌’ మాత్రం ఆమె నటనకు ప్రశంసలు తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో కొత్త సినిమాల విషయంలో ఆమె మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ‘రాకా’లో మృణాల్‌ నటిస్తున్నారనే వార్తలు నిజమైతే, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌తో కలిసి నటించే అవకాశం ఆమె కెరీర్‌కు ఉపయోగపడే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అట్లీ దర్శకత్వం, భారీ స్థాయి నిర్మాణం కారణంగా ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు వస్తుందని ఆమె భావిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

అధికారిక ప్రకటన ఎప్పుడో?

మృణాల్‌ తదుపరి సినిమాల ఎంపికపై ఆసక్తి నెలకొన్న వేళ.. ‘రాకా’లో ఆమె పాత్రపై స్పష్టత కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాతే ఆమె కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతారా? లేక అంతకుముందే ఇతర చిత్రాలను ప్రకటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. చిత్ర బృందం నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు మృణాల్‌, రష్మిక, జాన్వీ క‌పూర్‌ల పాత్రలపై వస్తున్న వార్తలను కేవ‌లం ఊహాగానాలుగా మాత్ర‌మే చూడాల్సి వ‌స్తోంది. సీతారామంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ మ‌ళ్లీ అదే స్థాయిలో హిట్ కోసం ఎదురుచూస్తోంది. మ‌రి ఆశ నెర‌వేరుతుందా లేదా? ఎదురుచూడాల్సిందే.

Advertisement
Advertisement